దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. స్పెషల్ గెస్ట్ ఎవరంటే..?

మ్యాన్ ఆఫ్ మాసేస్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తారక్ నుంచి వస్తున్న తాజా మూవీ దేవర.. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సముద్రపు నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడం.. అలాగే ఆర్‌ఆర్ఆర్ లాంటి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ నెలకొంది.

NTR Jr.'s 'Devara: Part 1' creates box-office record even before release.  Trailer date announced - The Economic Times

ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ.. ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఈనెల 27న సినిమా గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ ముందుకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. హైయెస్ట్ వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌత్ లో సినిమాపై మరింత హైప్‌ను పెంచేందుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ కు రంగం సిద్ధమవుతుందని.. మరో నాలుగు రోజుల్లో దేవర ప్రమోషన్స్ గ్రాండ్ లెవెల్ లో మొదలవుతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

NTR & Mahesh Babu To Deliver A 'Diwali' Special

ఇక ఈ సినిమాకు స్పెషల్ గెస్ట్ గా మహేష్ బాబు ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్య‌న ఉన్న బాండింగ్ గురించి చాలామందికి తెలుసు. మహేష్.. తారక్‌ను సొంత తమ్ముడిగా ఫీల్ అవుతూ ఉంటారు. వీరిద్దరి మధ్యన బాండింగ్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేస్తుంది. అంతేకాదు ఇద్దరూ ఎవరి సినిమా ప్రమోషన్స్ కు ఎవరు అవసరం ఉన్నా సరే కచ్చితంగా తమ వంతు సహాయంగా వారు ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే దేవర సినిమా ప్రమోషన్స్ కోసం స్పెషల్ గెస్ట్ గా మహేష్ బాబు వస్తున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇంకా క్లారిటీ లేదు.