యుఎస్ లో ‘ దేవర ‘ విధ్వంసం.. లేటెస్ట్ వసూళ్ళ లెక్కలు ఇవే.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలి ఖాన్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమా గా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్‌ఆర్ఆర్ తర్వాత దాదాపు రెండున్న‌రేళ్ళ‌ గ్యాప్‌తో ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం.. అలాగే తారక్‌ను సోలోగా చూసి ఆరేళ్లు గ్యాప్ రావడంతో.. సినిమాపై రిలీజ్ కు ముందే ప్రేక్షకుల విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి.

Jr NTR hypes up Devara, says 'last 40 minutes will rock you all' - India Today

ఇక ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యూసుదా ఆర్ట్‌స్‌ సంయుక్తంగా భారీ బడ్జెట్లో సినిమాలో తెర‌కెక్కించారు. ఈ క్రమంలోనే దేవ‌రా తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ మార్కెట్‌లోను భారీ వ‌సూళ్ళను కొల్లగొట్టి రికార్డులను క్రియేట్ చేసింది అలా డే 1కు దేవరా విపరీతమైన కలెక్షన్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా దేవర మార్కెట్‌లో.. కేవలం ప్రీ సేల్స్ లోనే రికార్డ్ గ్రాస్ ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దెవ‌రా క‌లెక్ష‌న్‌ల‌కు సంభందించిన మరో లేటెస్ట్ అప్డేట్ తెగ వైరల్‌గా మారుతుంది.

Devara: Part 1: Cast, Plot, Release Date & More, Here's Everything You Need To Know - Filmibeat

అలా దేవర సినిమా ఒక్క నార్త్ అమెరిక నుంచే ఏకంగా 2.8 మిలియన్ డాలర్స్ మార్క్‌ను క్రాస్ చేయడం అంటే సాధార‌ణ విష‌యం కాదు. ఈ క్రమంలోనే డే 1 కే దేవర ఈజీగా మూడు మిలియన్ డాలర్లను టచ్ చేస్తుందంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుఉతున్నాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన ప్రీమియర్ షో టాక్ తో సినిమాకు కాస్త మైనస్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాగా ఈ క్రమంలో దేవర యూఎస్‌లో లాంగ్ ర‌న్‌లో కలెక్షన్‌లు ఏ రేంజ్ లో కొల్లగొడుతుందో.. ఎంత మార్కులో సినిమా ఆగుతుందో వేచి చూడాలి.