అప్పట్లో నా హార్ట్ బ్రేక్ అయింది.. రిలేషన్ షిప్ పై మిల్కీ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా రిలేషన్‌షిప్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానుల‌తో షేర్ చేసుకుంది. తను కూడా తన లైఫ్ లో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు వివరించింది. తన టీనేజ్‌లో మొదటిసారి లవ్ లో పడ్డాను అని.. అయితే కొన్ని కారణాలతో అది అసలు సెట్ కాలేదు అంటూ తన జీవితంలో రెండు సార్లు హార్ట్ బ్రేక్ అయింది అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు రెండుసార్లు నాకు బ్రేకప్ జరిగిందని.. ఆ టైంలో నాకు చాలా బాధగా అనిపించిందని.. టీనేజ్ లో ఉన్నప్పుడు మొదటి హార్ట్ బ్రేక్ ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ఓ వ్యక్తి కోసం నాకు నచ్చిన లైఫ్‌ను వదులుకోవడం నాకు ఇష్టం ఉండదు. జీవితంలో ఏదో సాధించాలని.. కొత్త విషయాల గురించి తెలుసుకోవాలని.. నా ఆలోచన. ఆ కారణంగానే ఆ బంధం నిలవలేదంటూ చెప్పుకొచ్చింది తమన్నా. తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్నానని.. అయితే అతను నాకు సెట్ కాదనిపించి వదిలేసా. ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పే వాళ్ళంటే నాకు అసలు నచ్చదు.. అలాంటి వ్యక్తిత్వం బంధాన్ని కొనసాగించడం ప్రమాదం అని నాకు అర్థమైంది అందుకే ఆ బాండ్ కూడా అక్కడితో ముగిసిపోయింది అంటూ తమన్నా వెల్ల‌డించింది.

ఇక ప్రస్తుతం తమన్న.. విజయ్‌వర్మతో లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. లవ్ స్టోరీ 2 సిరీస్ లో కలిసి నటించిన ఈ ఇద్దరు మూవీ షూట్ టైంలో ప్రేమలో పడ్డారు. ప్ర‌స్తుతం విజయ్ తనకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని తమన్నా గట్టిగా నమ్ముతున్నారు. ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇక‌ సౌత్ లోనూ, బాలీవుడ్ లోను వరుస సినిమాలో అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్న మిల్కిబ్యూటీ.. స్త్రీ 2లో స్పెషల్ సాంగ్ లో నటించింది. దీంతో పాటే తమన్నా ఓదెలా 2 మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్లో ఉంది.