మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక.. మెగా డాక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలో హీరోయిన్గా నటించిన నిహారిక.. మరోవైపు ఎన్నో వెబ్ సిరీస్ లకు ప్రొడ్యూసర్ గాను వ్యవహరించింది. తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మూవీ ప్రొడ్యూసర్ గా మారిన ఈ అమ్మడు.. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నిహారిక.. తన గురించి.. తన కుటుంబం గురించి చెబుతూ.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా తన ఫస్ట్ సాలరీ గురించి అడగగా ఆమె స్పందించింది. ప్రస్తుతం నిహారిక చేసిన కమెంట్స్ నెటింట వైరల్ గా మారడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు. ఇంతకీ నిహారిక ఫస్ట్ సంపాదన ఏంటి.. ఆమె సినిమాలోకి రాకముందు ఏం పని చేసిందో ఒకసారి తెలుసుకుందాం.
నిహారిక మాట్లాడుతూ టీవీ షోలోకి రాకముందు తను హైదరాబాద్‌లో ఉండి ఓ కేఫ్ లో పనిచేశానని.. అక్కడ వాళ్ళు తనకు వారానికి రూ.1000 ఇచ్చేవారు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే నిహారిక మాట్లాడుతూ తన తండ్రి తనపై ఇష్టంతో ఎక్కడికి పంపించడానికి ఇష్టపడలేదని.. అందుకే ఇక్కడే చదువుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. యాంకర్ గా నిహారిక తన సినీ కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక మనసు సినిమాలో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈమె మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్నో టీవీ షోలకు గెస్ట్ గా హాజరై సందడి చేసింది. జొన్నలగడ్డ చైతన్యతో వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. మనస్పర్ధలతో పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇక విడాకుల తర్వాత కెరీర్ పై ఫోకస్ చేసిన నిహారిక.. నిర్మాతగా సొంత బ్యానర్ స్థాపించి.. పలు సినిమాలను తెరకెక్కిస్తూ కొత్త వాళ్లకు ఎంకరేజ్ చేస్తుంది. ఇక మెగా హీరోలు నటించిన పలు సినిమాల్లో కూడా నిహారిక కీలకపాత్రా లను పోషించింది. నిర్మాతగా తన తండ్రి సక్సెస్ కాకున్నా.. నిహారిక మాత్రం సక్సెస్ బాటలో అడుగులు వేస్తుంది. ఇక ఎప్పటికప్పుడు నిహారిక సెకండ్ మ్యారేజ్ పై ఏవో ఒక వార్తలు నెటింట వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిపై తాజాగా నిహారిక రియాక్ట్ అయింది. కచ్చితంగా లైఫ్ లో పార్ట్నర్ ఉండాలి. అయితే సరైన భాగస్వామి వస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో మెగా డాటర్ అయ్యుండి.. అంతా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా.. ఓ చిన్న కేఫ్ లో వెయ్యి రూపాయల కోసం పనిచేస్తుందా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.