నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోద శనివారంతో పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో.. నాని మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాయ్ నాన్న, దసరా సినిమాలతో వరుస సక్సెస్లు అందుకున్న నాని.. మరోసారి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బిజినెస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో.. సరిపోదా శనివారం ఏ ప్లేస్ లో నిలిచిందో ఒకసారి తెలుసుకుందాం.
నాని తాజాగా సరిపోద శనివారం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా (ఆగస్టు 29)న ఈ సినిమా థియేటర్లో గ్రాండ్ లెవెల్లో రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకు.. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా.. ఎస్.జే. సూర్య విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక గత ఏడాది డిసెంబర్లో నాని నుంచి వచ్చిన మూవీ హాయ్ నాన్న. ఈ సినిమా ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. రూ.27.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా.. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహించాడు. ఇక గతేడాది నాని నుంచి రిలీజ్ అయినా మరో మూవీ దసరా. శ్రీకాంత్ ఒద్దెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు రూ.50కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా కంటే ముందు నాని నటించిన మరో మూవీ అంటే సుందరానికి. రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ జరుపుకున్న ఈ సినిమా.. వివేకాత్రేయ డైరెక్షన్లో తెరకెక్కింది. ఇక నాని నటించిన మరో మూవీ శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు మొదట రూ.22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ నితెచ్చుకున్న కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయింది. నాని హీరోగా తెరకెక్కిన మరో సినిమా గ్యాంగ్ లీడర్. ప్రియాంక అరుణ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా.. విక్రమ్. కే. కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు రూ.28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా కంటే ముందు నాని హీరోగా నటించిన మూవీ జెర్సీ.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో బచ్చింది. ఈ సినిమాకు రూ.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.