మరోసారి వాయిదా పడనున్న పుష్ప 2.. అల్లు అర్జున్ క్లారిటీ..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సూకుమార్ డైరెక్షన్‌లో పుష్ప ది రూల్.. పుష్పది రైస్ కు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజై భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకుగాను ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకొని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కనున్న పుష్ప ది రూల్ సినిమాపై.. సుకుమార్ మరింత దృష్టి సారించాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా మరింత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. దీంతో పుష్పా2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Icon Star Allu Arjun About Pushpa 2 Movie @ Maruthi Nagar Subramanyam Pre  Release Event | TFPC - YouTube

ఇక ఇప్పటికే ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. గ‌తంలోనే ప్రేక్షకులు ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ఏవో అనివార్య‌ కారణాలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇక కొద్ది వారాల క్రితం ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వివరించారు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందంటూ వార్తలు వినిపించాయి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడడం ఏంటి అంటూ అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన మొదలైంది. ఇక‌ ఈ వార్తలపై తాజాగా అల్లు అర్జున్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 వాయిదా పడేదే లేదంటూ చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 6వ తేదీన సినిమా ఖచ్చితంగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని.. తాజాగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ క్లియర్గా వివ‌రించాడు.

Allu Arjun confirms Pushpa 2 release date today at an event . 6th December  2024

కచ్చితంగా డిసెంబర్ 6న సినిమా రిలీజ్ కానుంది అని స్పష్టం చేసినా.. కొన్ని సీన్స్ ఒక్కరోజులో చేయాల్సి ఉండగా.. రెండు రోజుల టైం పట్టిందని.. ఇది ఫ్యాన్స్ కోసమే వస్తున్న సినిమా అని వివరించారు. ఇక ఇదే టైంలో యాంకర్ సుమ ఈవెంట్‌లో సుకుమార్ ను ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు సంధించింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2,.. పుష్ప, పుష్ప2 ఇలా రెండు పార్ట్‌లుగానే అన్ని సినిమాలు వస్తాయా అని అడగ్గా పార్ట్ 1,2 మాత్రమే కాదు 3,4,5 ఇలా మ‌రి కొన్ని న‌భాగాలు కూడా రావచ్చు అంటూ సుకుమార్ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలో సుకుమార్ ఏమైనా కొత్త ప్లాన్ చేస్తున్నాడా.. అనే సందేహాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ఈ సందేహాల‌కు క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.