రవితేజ రెమ్యూనరేషన్ కోసం చూస్తూ కెరర్ నాశనం చేసుకుంటున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గౌండ్ లేకుండా అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీనటుల్లో మ‌స్ మ‌హారాజ్ రవితేజ ఒకడు. ఇక తాజాగా రవితేజ నుంచి వ‌చ్చిన‌ మిస్టర్ బచ్చన్ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన నేగిటివిటి వినిపించింది. కాగా ఈ క్ర‌మంలో సినిమాకు నిత్మాత‌లు న‌ష్ట‌పోవ‌డం ఖాయం అంటూ కూడా అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. అలాగే ఈ సినిమాతో ర‌విఏజ‌కు భారీ ఫ్లాప్‌ మూట గట్టుకున్న‌ట్లు అయ్యింది.Mr. Bachchan Review: మిస్టర్ బచ్చన్ రివ్యూ - NTV Telugu

ఇక గత కొంతకాలంగా ఆయ‌న‌ నటిస్తున్న సినిమాలో అన్ని ఫ్లాప్‌లుగా నిలవడంతో.. మాస్ మహారాజ్‌పై కూడా.. నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తను కేవలం రెమ్యూనరేషన్ కోసం చూసుకుంటూ.. సినిమాల కంటెంట్ విషయంపై శ్రద్ధ చూపడం లేదని.. ఈ క్ర‌మంలో రవితేజ కెరీర్ రోజు రోజుకు మరింత డౌన్ ఫాల్ అవుతుందంటూ.. పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ట్రేడ్ పండితులు కూడా ఇదే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక‌ ఇప్పటికైనా మాస్ మహారాజ్ చేసే సినిమాల కథల విషయంలో, కంటెంట్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుని సినిమాలో నటిస్తే బాగుంటుందని.. లేకుంటే మాత్రం ఆయన సినిమాలు ముందు ముందు సక్సెస్ అందుకోవడం మరింత కష్టమవుతుందని టాక్‌.

Eagle Movie Review: రివ్యూ: ఈగల్‌.. రవితేజ ఖాతాలో హిట్‌ పడిందా? | eagle- movie-review-in-telugu

ఇక సినిమాను నటించే సమయంలో దానికి సంబంధించిన ఎన్నో విషయాలపై కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతూ సినిమాలో నటించినప్పుడే.. మంచి సక్సెస్ అందుకోగలుగుతారంటూ.. డబ్బుల కోసం మాత్రమే సినిమాలు చేస్తే ఇలాంటి ఫలితాలే ఉంటాయని.. క్రిటిక్స్ సైతం రవితేజ పై ఫైర్ అవుతున్నారు. ఇక మాస్ మహారాజ్ చేయబోయే సినిమాల విషయంలోను జాగ్రత్తలు తీసుకుంటాడా..? లేదా..? ఎలాంటి కంటే ఎంచుకొని సినిమాలో నటిస్తాడు..? తన సినిమాలతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో..? వేచి చూడాలి. అయితే ఇప్పటికైనా మంచి కంటెంట్ ఎంచుకొని సినిమాలో నటించి సక్సెస్ సాధిస్తే తప్ప.. ఆయనకు గతంలో ఉన్నంత మార్కెట్ రావడం కష్టం.