టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండేళ్ల క్రితం త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ పాన్ ఇండియా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రెండు పార్టీలుగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో పాటు తొలి రెండు పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.
ఇక ఎన్టీఆర్ అభిమానులు… టాలీవుడ్ అభిమానులు అయితే దేవర సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ గతంలో కొరటాల శివ డైరెక్షన్లో జనతా గ్యారేజ్ సినిమా చేశారు. జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. దేవర సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన చుట్టుమల్లె సాంగ్ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచేసింది.
ఇక ఈ సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే రికార్డును సృష్టించింది.. యూట్యూబ్ లో రిలీజ్ అయిన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటల్లో దేవర చుట్టమల్లె సాంగ్ మూడవ స్థానంలో నిలిచిందంటేనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తోంది. 24 గంటల్లో ఈ పాటకు 16 మిలియన్ల వ్యూస్ రాగా.. ఇప్పుడు 40 మిలియన్లు దాటేసి 50 మిలియన్ల దిశగా దూసుకు పోతోంది. దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఇక దేవర సినిమాను 120 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీస్తున్నట్లు సమాచారం.