వాట్.. నివేదాకు ఎప్పుడో పెళై పోయింది.. బిగ్ బాంబు పేల్చిన స్టార్ బ్యూటీ..!!

టాలీవుడ్ హీరోయిన్ నివేద థామస్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నివేదా తన నేచురల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు.. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిన్న పోస్ట్‌ షేర్ చేసుకుంది. దీంతో నెటింట‌ నివేదా థామస్ పెళ్లి ఫిక్స్ అయిందంటూ ప్రచారాలు గుపుమన్నాయి. అయితే తాజాగా తన కొత్త సినిమా.. ” 35 చిన్న కథ కాదు ” టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ దీనిపై స్పందించింది నివేద థామస్.

తన పెళ్ళంటూ జరిగిన ప్రచారంపై అమ్మడు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఇటీవల నేను షేర్ చేసిన ఓ ఫోటో చూసి.. అంతా నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనుకున్నారు. దానిపై వార్తలు రాగానే మా అమ్మ నాకు ఆ ఫోటోను షేర్ చేసింది. అవునా అమ్మ.. మీరు నాకెప్పుడూ అబ్బాయిని చూశారు.. అని అమ్మను అడిగా అంటూ వివరించింది. ఇందులో భాగంగానే సినిమాలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. నాకు పెళ్లి అయిపోయింది.. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్, వరుణ్ అంటూ సరదాగా ముచ్చటించింది.

YouWe Media | Joyful Faces All Around at the Teaser Launch of '35 Chinna  Katha Kaadu' ✨ Watch #35Movie Teaser Here 👇 --… | Instagram

ఈ సినిమాలో తల్లిగా నటించడం పెద్ద సవాలుగా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇక మూవీ టీజర్ తో సినిమా కదా అంశానికి ఆడియన్స్ కు పరిచయం చేసామని అమ్మడు పేర్కొంది. ఇక సినిమాలో బాలన్నటఉలుగా ఉన్న‌ పిల్లలు తనను మేడం, అక్క అని కాకుండా.. అమ్మ అని పిలిచారని ఆనందాన్ని వ్యక్తం చేసింది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో జరిగే ఫ్యామిలీ స్టోరీ గా ఈ సినిమా తెర‌కెక్నుంది. నందకిషోర్ ఇమాని దర్శకత్వంలో వ‌స్తున్న ఈ సినిమాకు రానా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక‌ ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.