మన స్టార్ హీరోలకు పోటీగా మోక్షజ్ఞ.. సక్సెస్ సాధ్యమేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోలుగా మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తప్పించి మిగతా స్టార్ హీరోస్ అంతా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక రామ్ చరణ్ ఎంట్రీ తర్వాత ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆయన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేక పోయారు. 2007లో చిరుతతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు చరణ్. ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దగ్గర పడుతుంది. ఈ క్రమంలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ త‌న‌యుడు ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ఈ క్ర‌మంలో స్టార్ హీరోలకు దీటుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించగలడా..? అనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది.

Hudhud Relief Fund: RGV Takes Dig at Pawan Kalyan, Mahesh Babu, NTR, Ram  Charan, Prabhas - IBTimes India

ఇక మోక్షజ్ఞ ఎంట్రీ తో తన మొదటి సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంటే.. పాన్ ఇండియా లెవెల్ లో అవకాశాలను దక్కించుకుని.. స్టార్ హీరోగా మారే అవ‌కాశం ఉంది. దీంతో మోక్షజ్ఞ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉండబోతున్నాయి..? అభిమానుల అంచనాలను అందుకోగలుగుతాడా.. ? లేదా..? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇప్పటివరకు మోక్షజ్ఞకు సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెటింట‌ వైరల్ అయ్యాయి. కానీ ఆయన డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి అనే విషయం ఇప్పటివరకు అభిమానులకు కూడా తెలియదు. అయితే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ మోక్షజ్ఞ ఎప్పటికప్పుడు తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు.

EPIC on X: "Next Big Thing in Tollywood 🥵🥵 Remember the Name Nandamuri  Mokshagna Teja 🔥🔥 https://t.co/MHbzKhCxoN" / X

ఈ క్రమంలో మోక్షజ్ఞ మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకొని బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే మోక్షజ్ఞకు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీల దగ్గర నటనకు సంబంధించిన శిక్షణ ఇప్పించారట బాలయ్య. ఇక మోక్షజ్ఞ తన అన్నలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దగ్గర కూడా కెరీర్ పరంగా కొన్ని సలహాలను తీసుకుంటే.. తప్పకుండా టైర్ వన్ స్టార్ హీరోల రేసులో అడుగు పెట్టగలడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మోక్షజ్ఞ తన మొదటి సినిమాతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి.