సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి… తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాలలో… వేణు స్వామికి ఉన్న క్రేజ్ అంతాకాదు. సోషల్ మీడియా, లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వేణు స్వామి వీడియోలే మనకు కనిపిస్తాయి. అంతలా పాపులర్ అయ్యాడు వేణు స్వామి. సమంత అలాగే నాగచైతన్య విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే వారిద్దరు విడాకులు తీసుకోవడంతో.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు వేణు స్వామి.
అంతేకాదు…. ప్రభాస్ పెళ్లి గురించి, నయనతార పెళ్లి తర్వాత కష్టాల గురించి, అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ గురించి వేణు స్వామి. సెలబ్రిటీల గురించి కాకుండా… పొలిటిషన్ గురించి కూడా నిత్యం.. చెబుతూ ఉంటారు. ఏపీలో ఈ పార్టీ గెలుస్తుంది.. తెలంగాణలో ఆ పార్టీ గెలుస్తుందని కూడా జాతకాలు చెబుతూ ఉంటారు వేణు స్వామి. ఇలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వేణు స్వామికి.. తాజాగా బంపర్ ఆఫర్ తగిలినట్లు సమాచారం అందుతుంది.
త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో వేణు స్వామి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఈ మేరకు ఇప్పటికే వేణు స్వామి తో చర్చలు చేశారట బిగ్ బాస్ ప్రతినిధులు. దీనికి వేణు స్వామి కూడా ఒప్పుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు టాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.
అయితే బిగ్ బాస్… సీజన్లో పాల్గొనేందుకు… భారీగానే రెమ్యూనరేషన్ అడుగుతున్నారట వేణు స్వామి. ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలో… ఏ సెలబ్రిటీ అడగనంత రెమ్యూనరేషన్ వేణు స్వామి అడిగారట. దీంతో బిగ్ బాస్ ప్రతినిధులు భయపడి… ఆ తర్వాత వేణు స్వామి డిమాండ్ కు ఒప్పుకున్నారట. ఇక అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం అందుతోంది.