ఆ విషయంలో చిరును ఫాలో అవుతున్న తారక్.. నయా ట్రెండ్ సెట్ చేస్తున్నాడుగా.. ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మధ్యలో కొంతకాలం గ్యాప్ ఇచ్చిన చిరు మళీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రి ఇచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్టింగ్ రిజల్ట్ అందుకున్నాడు. మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో రుజువు చేసుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి నుంచి వచ్చిన వాల్తేరు వీరయ్య తప్ప ఏవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభ‌ర సినిమా షూట్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi: ప్రభుత్వ లక్ష్యం అదే.. మార్పు తీసుకురండి! | Megastar Chiranjeevi Anti Drug Awareness Campaign Message Goes To Viral KBK

ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కసితో ఉన్నాడు మెగాస్టార్. ఇక ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా టక్కుమని గుర్తుకు వచ్చే ఇండస్ట్రీ పెద్దదిక్కుగా చిరంజీవి ఉంటాడు. అలా చిరంజీవి ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపాడు. ఇక రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్ రేట్లు కోసం మా దగ్గరికి వచ్చే సినీ ప్రముఖులకు అందరికీ నేను ఈ కండిషన్ పెడుతున్నా.. కనీసం రెండు నుంచి మూడు నిమిషాలు డ్రగ్స్ నివారణకు అవేర్నెస్ వీడియోను చేయాలంటూ వివరించాడు.

అయితే దాదాపు కొన్ని నెలల క్రితమే మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ నేరాల గురించి అవేర్నెస్ వీడియోని షేర్ చేశాడు. ఆ తర్వాత ఆయన దారిలోనే ఎన్టీఆర్ కూడా వీడియోతో అవేర్నెస్ కల్పించాడు. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి మాదిరిగా అవేర్నెస్ వీడియోలు చేయాలి అంటూ సెల‌బ్రెటీల‌ను కోరిన సంగతి తెలిసిందే. కాగా ఇదివరకు ఎన్టీఆర్ కూడా ఈ అవేర్నెస్ వీడియో చేయడం వల్ల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి బాటలో హీరో తార‌క్ అంటూ.. యంగ్ హీరోల‌లో మంచి ట్రెండ్ సెట్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.