స్టార్ట్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం భాలీవుడ్లో ఉల్లాఝ్ మూవీ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సుధాంశు సరియా డైరెక్షన్లో ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అలాగే ఇటీవల ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సుహానా భాటియాగా ఇందులో జాన్వి నటించింది. యువ ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఇందులో కనిపిస్తుంది.
ఇక కొన్ని కుట్రల కారణంగా.. ఎన్నో ఆరోపణలు ఎదుర్కోవడమే కాదు.. విమర్శలు కూడా ఫేస్ చేసి ఎలా వాటి నుంచి బయటపడింది అనేది మూవీ స్టోరీ. ఇప్పటికే మంచి అశక్తి నెలకొన్న ఈ సినిమా వచ్చేనెల అంటే ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జాన్వీ కపూర్ బాలీవుడ్లో కూడా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అమ్ముడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనంది. ఇక ఈ సినిమా ఇంకా థియేటర్స్ లోకి రాకముందే.. రాంచరణ్‌తో మరో సినిమా అవకాశాన్ని కొట్టేసిన జాన్వి.. బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్‌తో కలిసి నటించబోతుంది. ఈ క్రమంలో జాన్వీకాపూర్కు సంబంధించిన ప్రతి అప్డేట్ టాలీవుడ్‌లోనూ తెగ వైరల్‌గా మారుతున్నాయి.