ఆ విషయంలో రేణు దేశాయ్‌ను ఫాలో అవుతున్న నమ్రత శిరోద్కర్.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లిస్టులో మహేష్ బాబు, నమ్రత జంట పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో బాలీవుడ్ వరస క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన నమ్రత.. తెలుగులో మహేష్ బాబుతో వంశీ సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా.. వీరిద్దరి మధ్యన మంచి సానిహిత్యం ఏర్పడింది. ఈ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారడంతో రహస్యంగా ఐదేళ్ల ప్రేమాయణం నడిపారు. తరువాత కుటుంబ సభ్యుల సమక్షంలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక ఇప్పటికీ వీళ్ళిద్దరి పెళ్లి జరిగి దాదాపు 20 ఏళ్లు పూర్తవుతుంది. వీరికి సితార, గౌతం అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

From first meeting, falling in love to their intimate wedding: Mahesh Babu  and Namrata Shirodkar's evergreen love story

వాళ్లు కూడా సోషల్ మీడియాతో అభిమానులకు బాగా దగ్గరయ్యారు. అయితే పెళ్లి తర్వాత మహేష్ కి ఇచ్చిన మాట ప్రకారం.. నమ్రత సినిమాలకు చెక్ పెట్టింది. కేవలం ఇంటి బాధ్యతలు, మహేష్ వ్యాపారాలు మాత్రమే చూసుకుంటూ గృహిణిగా రాణిస్తున్న నమ్రత.. ఇప్పుడు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆమె ఓ యంగ్ హీరో సినిమాలో కీరోల్‌ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. న‌టిగా మళ్లీ రాణించాలని కోరిక ఆమెకి ఏమీ లేదట. కానీ ఓ దర్శకుడు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతో సినిమాలో నటించేందుకు నమ్రత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది.

Renu Desai Fails To Impress With 'Tiger Nageswara Rao'! | Renu Desai Fails  To Impress With Tiger Nageswara Rao

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పవన్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రీఎంట్రీలో మొదట బుల్లితెర షోలకు జడ్జిగా వ్యవహరించింది. తర్వాత రవితేజ  సినిమాతో ముఖ్య పాత్ర పోషించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఆమె పవర్ఫుల్ రోల్స్‌, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవడానికి ప్లాన్ చేసుకుంటుంది. ఈ విష‌యంలో న‌మ్ర‌త రేణును ఫాలో అవుతూ తన సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుందా.. లేదా కేవలం ఒక్క సినిమాతో సరిపెడుతుందా.. అనేది మాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ నమ్రత ఇప్పుడు నటించబోయే సినిమాతో మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ కచ్చితంగా కొనసాగిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు.