‘ దేవర ‘లో తన రోల్ ఎలా ఉంటుందో రివీల్ చేసేసిన జాన్వీ కపూర్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మోస్ట్ అవైటెడ్‌గా తెర‌కెక్కుతున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో ఇది నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇలాంటి క్రమంలో దేవర నుంచి అఫీషియల్ అప్డేట్స్ ఏవి వినిపించ‌క‌పోయినా.. ఎప్పటికప్పుడు ఎన్నో రకాల పుకార్లు సోష‌ల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో దేవర హీరోయిన్ జాన్వి కపూర్ తన పాత్ర గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను రివల్ చేసింది.

కాగా ప్ర‌స్తుతం జాన్వి చేసిన కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్‌గా మారాయి. ఇక జాన్వి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న మొట్టమొదటి సినిమా దేవర కావడం విశేషం. ఇంకా ఈ సినిమా రిలీజ్ అయిన కాకముందే రాంచరణ్, బుచ్చిబాబు కాంబోలో మరో సినిమా అవకాశాన్ని కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా న్యాచుర‌ల్‌స్టార్‌ నాని సినిమాలో మరో అవకాశాన్ని దక్కించుకుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఆఫర్స్ క్యూ కడుతున్న క్రమంలో అమ్మడు సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక శ్రీదేవికి కూడా జాన్వీ టాలీవుడ్‌కి రావాలని అక్కడ సినిమాల్లో నటించాలని కోరికను ఎన్నో సందర్భాల్లో వివరించింది.

అలాగే టాలీవుడ్ ఆడియన్స్ కూడా శ్రీదేవి కూతురు వెండితెరపై చూడాలని కోరుకున్నారు. వారి కోరికను తీరుస్తూ దేవరతో సెప్టెంబర్ 27న జన్వీ వెండితెర‌పై ప్రత్యక్షం కానుంది. ఈ క్రమంలో దేవర సినిమాలో తన పాత్ర గురించి జాన్వి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమాలో నా పాత్ర సెకండ్ హాఫ్‌లో నడివి ఎక్కువగా ఉంటుందని.. తారక్‌తో ఒక సాంగ్ చేశానని వివరించింది. నెక్స్ట్ సాంగ్ షూట్ కోసం వెయిట్ చేస్తున్నానంటే చెప్పిన జాన్వి.. తారక్ తో కలిసి డ్యాన్స్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉందంటూ వివరించింది. ఇక జాన్వీ దేవ‌ర‌ గురించి చేసిన ఈ కామెంట్స్ నేపథ్యంలో ఈమె నెగటివ్ రోల్ లో నటించబోతుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవర మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లే.. ఇంకా కాస్త షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని టాక్ నడుస్తుంది.