పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్‌గా మారినా.. జక్కన్న డౌన్ టూ ఎర్త్ ఉండడానికి కారణం అదేనా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా, స్టార్ డైరెక్టర్ క్రేజ్ సంపాదించుకున్న చాలామంది సెలబ్రిటీస్ ఒక్క మంచి సక్సెస్ వస్తే చాలు.. ఆకాశమే హద్దుగా పార్టీలు చేసుకుంటూ సందడి చేస్తూ ఉంటారు. మనల్ని మించిన సెలబ్రిటీ మరొకరు లేరు అన్నట్లుగా హంగామా చేస్తూ ఉంటారు. గర్వం తలకెత్తినట్లుగా బిహేవ్‌ చేస్తూ ఉంటారు. అలాంటి సంఘటనలు ఎన్నో మనం వింటూనే ఉంటాం. కానీ.. ఇలాంటి వారికి రాజమౌళి పూర్తి భిన్నంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్న రాజమౌళి.. తను కెరీర్ ప్రారంభం నుంచి త‌ను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో 100% సక్సెస్ రేట్‌ను అందిస్తూ దూసుకుపోతున్నాడు. అలాంటి రాజమౌళి ఎక్కడ కూడా కాస్తయినా గర్వం చూపించకుండా డౌన్ టు ఎర్త్ లానే ఉంటాడు.

The Man Behind India's Controversial Global Blockbuster “RRR” | The New  Yorker

ఎవరిని తక్కువ చేసి చూడడం కానీ.. హేళనగా మాట్లాడడం కానీ ఎప్పుడు కనిపించదు. ఇక‌ ఎలాంటి ఈవెంట్లకు వెళ్లిన.. ఏ సినిమా ప్రమోషన్స్ అయినా.. డీసెంట్‌గా ఈవెంట్లో పాల్గొని ఆ ఈవెంట్‌కు సినిమాకు సంబంధించిన నాలుగు మాటలు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతాడు తప్ప ఎవరి గురించి తప్పుడుగా మాట్లాడడం.. తప్పుడు పోస్టులు పెట్టడం ఇప్పటివరకు జరగలేదు. ఎంత ఎదిగిన అంతే ఒదిగి ఉండే లక్షణంతో రాజమౌళి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అలా డౌన్ టు ఎర్త్ పర్సన్ గా ఉండడం వల్లే రోజురోజుకు ఆయనకు అభిమానుల సంఖ్య మరింతగా పెరుగుతుంది.

SS Rajamouli Latest News, Photos, Videos and Analysis- Indiatoday

మనం ఎలాంటి సినిమాలను తెరకెక్కించినా.. ఎంత గొప్ప సినిమాలో అయినా ఇతరుల సినిమాలను కూడా ఆదరించాలని ఉద్దేశం వాళ్ళు తీస్తున్న సినిమాలను నచ్చకపోతే చూడడం మానేస్తే సరిపోతుంది. కానీ నెగిటీవ్‌గా మాట్లాడడం.. చెడు కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ విధానం కాదని రాజమౌళి భావిస్తాడట. అలాగే ఆయన తాను తీసిన సినిమాలు కాకపోయినా.. కంటెంట్ ఉంటే సినిమాను ప్రశంసిస్తూ ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా అభినందించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలా ఇతరులతో గొడవలు పెట్టుకోకుండా.. తన విజ‌న్‌లో తాను సినిమాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు కాబట్టే.. రాజమౌళి దర్శక ధీరుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.