క్లీం కార పుట్టినరోజు నాడు ..మెగా అభిమానులను హర్ట్ చేసిన ఉపాసన(వీడియో)..!

నేడు మెగా మనవరాలు క్లీం కారా పుట్టినరోజు . మెగాస్టార్ చిరంజీవి పేరు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో మారుమ్రోగిపోతూ ఉంటుందో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చిన ఆయన తన పేరు చెప్పుకొని పదిమంది ఇండస్ట్రీలోకి వచ్చేలా మార్చుకున్నాడు . ఆ తర్వాత రామ్ చరణ్ కూడా అదే స్థాయిని అందుకున్నాడు. అయితే వీళ్ళిద్దరి కన్నా చాలా చాలా తక్కువ టైంలోనే సోషల్ మీడియాలో తాత తండ్రికి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునేసింది క్లిం కారా.

రామ్ చరణ్ ఉపాసనలకు దాదాపు పెళ్లి అయిన 11 ఏళ్ల తర్వాత పుట్టిన మొదటి సంతానమే ఈ క్లిం కార. జూన్ 20వ తేదీ అపోలో హాస్పిటల్స్ లో జన్మించిన క్లింకారా నేడు తన మొదటి పుట్టినరోజును జరుపుకుంటుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా పలువురు స్టార్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్ విషెస్ మెగా ఫాన్స్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఉపాసన తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేసింది .

ఈ వీడియోలో క్లీం కారా పుట్టిన టైంలో ఉపాసన ..ఉపాసన తల్లి.. మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా సురేఖ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఫీలయ్యారు .. వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి .. అనే విషయాన్ని చాలా చాలా ఓపెన్ గా చూపించింది . మరీ ముఖ్యంగా ఉపాసన ఎమోషనల్ అవుతూ క్లింకారాను చేతిలోకి తీసుకున్న పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే మొదటి పుట్టినరోజు అయిన కూడా ఫేస్ రివిల్ చేస్తూ ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయకపోవడం మెగా ఫాన్స్ ను డీప్ గా హర్ట్ చేస్తుంది. కనీసం ఇప్పటికైనా ఒక్క ఫోటో షేర్ చేయొచ్చు కదా మేడం అంటూ ఉపాసనను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ .. చూద్దాం మరి ఉపాసన ఏం చేస్తుందో..?