‘ కల్కి ‘ లాస్ట్ మినిట్ లో అలాంటి ట్విస్ట్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..?!

కల్కి సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో భారీ కాస్టింగ్ తో పాటు హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో రూపొందింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయని ప్రభాస్ అభిమానులు భావించారు. అయితే యావరేజ్ లెవెల్‌లోకూడా ప్రమోషన్స్ లేకపోవడంతో ప్రభాస్ కటౌట్ కి, సినిమా బడ్జెట్ కు తగ్గట్టు ప్రమోషన్స్ లేవంటూ ఫాన్స్ ఇప్పటికే నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Kalki 2898AD Pre Release Event: Legendary Atmosphere, Poor Management

ఇక ఇప్పటికీ కల్కి నుంచి వచ్చిన గ్లింప్స్‌, పోస్టర్, స్క్రాచ్ వీడియోలు, ట్రైలర్ అమెజాన్‌లో పలు వీడియోలను వదిలిన ఊహించిన రేంజ్ లో సినిమా పై బజ్‌ అయితే తెప్పించలేకపోయారు. అయితే తాజాగా రిలీజ్ అయిన పవర్ ఫైట్ ట్రైలర్ తో సినిమాపై కాస్త హైప్‌ నెలకొంది. ఇక దీనికంటే ముందు తెలుగులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేసి మేకర్స్ సినిమాపై హైట్ పెంచుతారు అంటూ వార్తలు వినిపించాయి. అమరావతిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను స్పెషల్ గెస్ట్‌లుగా పిలిచి సినిమాపై మరింత హైప్‌ తీసుకురానున్నారంటూ రూమర్లు వైరల్ అయ్యాయి. తాజాగా అవన్నీ పుకార్లేనని ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వినిపించాయి.

Amitabh Bachchan shares a group photo from the latest Kalki 2898 AD event |  Filmfare.com

దీంతో తెలుగు ప్రేక్షకులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. అయితే హైదరాబాద్‌లో ఈవెంట్ ఉంటుందంటూ మరోసారి వార్తలు వినిపించాయి. ఇప్పుడు అది కూడా లేనట్లు తెలుస్తుంది. దీంతో టాలీవుడ్ ఆడియన్స్‌కి ప్రి రిలీజ్ ఈవెంట్ లేనట్టే అనే డిసప్పాయింట్మెంట్ మరింతగా ఎక్కువైంది. దీంతో మేకర్స్‌ పై ఫైర్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే తెలుగులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పై మేక‌ర్స్‌ అనౌన్స్మెంట్ ఏదైనా ఇస్తే గాని దీనిపై క్లారిటీ రాదు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే, దిశా పటాణి లాంటి ప్రధాన తారాగ‌ణం అంత నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా క్యామియో రోల్స్ లో ప్లే చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. దీంతో సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాల నెలకొన్నాయి. రూ.400 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ పై కన్నేసాడు ప్రభాస్. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.