మరో ఐదు రోజుల్లో “కల్కి” రిలీజ్..కొంప ముంచేసిన నాగ్ అశ్వీన్ చేసిన ఆ ఒక్కే ఒక్క పని..?!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాకి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. మహానటి సినిమాను డైరెక్ట్ చేసిన నాగ్ అశ్వీన్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమానే..ఈ కల్కి . మూడు ప్రపంచాలు కలిస్తే ఏ విధంగా ఉండబోతుందో ముందుగానే జనాలకు తెలియజేస్తున్నాడు నాగ్ అశ్వీన్. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కూడా టచ్ చేయని ఓ స్పెషల్ కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు .

ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . కాగా ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెండు ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . రెండూ కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ప్రమోషన్స్ విషయంలో మాత్రం నాగ్ అశ్వీన్ రాజమౌళిని బీట్ చేయలేకపోతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రిలీజ్ అయిన ట్రైలర్స్ చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా రాజమౌళి బాహుబలి కి మించిన రేంజ్ లో హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

అయితే ప్రమోషన్స్ లో మాత్రం రాజమౌళి లెవెల్ ని తాకలేకపోతున్నాడు నాగ్ అశ్వీన్. రాజమౌళి ఎంత పకడ్బందీగా ప్రమోషన్స్ నిర్వహిస్తారో తెలిసిందే.. అయితే నాగ్ అశ్వీన్ మాత్రం తెలుగులో అసలు ప్రమోషన్స్ నిర్వహించడం లేదు .. కంటెంట్ ఉన్న సినిమాకు ప్రమోషన్స్ ఎందుకు అనుకున్నాడో ఏమో..? అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నాగ్ అశ్వీన్ పై మండిపడుతున్నారు . ఇంత ఖర్చు పెట్టి తీసిన సినిమాకు ప్రమోషన్స్ లేకపోతే ఎలా బాసు అంటూ ఫైర్ అవుతున్నారు..?