ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీకి దగ్గర అవ్వడానికి మెగా ఫ్యామిలీకి దూరం కాబోతున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . తనదైన స్టైల్ లో డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలను చూస్ చేసుకునే రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ చేంజర్ సినిమా షూట్ ను ఫినిష్ చేసుకున్నారు . కాగా త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు .
ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది. మరొక బ్యూటీగా రష్మిక మందన్నా సెలెక్ట్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాపై హ్యూజ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు. కాగా ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించడానికి రామ్ చరణ్ బాగా కష్టపడుతున్నారట . అంతేకాదు తన ఓవర్ ఆల్ లుక్ ని చేంజ్ చేసుకోవడానికి ఏకంగా రెండు నెలల పాటు ఆస్ట్రేలియాలో ఉండబోతున్నారట .
అక్కడ సెపరేట్ ట్రైనర్ను అపాయింట్ చేసుకున్నారట . ఈ క్రమంలోనే కుటుంబానికి రామ్ చరణ్ రెండు నెలల దూరంగా ఉండబోతున్నారు అన్న వార్త బాగా వైరల్ గా మారింది. ఇప్పటివరకు రామ్ చరణ్ తన కెరీర్ లో ఇలా చేయకపోవడం గమనార్హం. ఫస్ట్ టైం ఈ సినిమా కోసమే ఇలా చేస్తున్నాడు అంటేకాదు.. ఉపాసన క్లీం కార ను కూడా తనతో పాటు తీసుకుని వెళ్లబోతున్నరట..!