ఓరి దేవుడోయ్.. ప్రైవేట్ జెట్..కాస్ట్లీ బంగ్లా.. ఇంత డబ్బులు విజయ్ దేవరకొండకి ఎలా వస్తున్నాయ్..?

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ఒక్కొక్క సినిమాకి ఎలాంటి హై రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం . ఒకటి కాదు రెండు కాదు కోట్లే .. పది కోట్లు .. 12 కోట్లు .. 20 కోట్లు.. 30 కోట్లు నెంబర్ పెంచుకుంటూనే పోతున్నారే తప్పిస్తే ఎక్కడ తగ్గించడం లేదు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ అసలు హిట్ కొట్టిందే లేదు. వరుసగా ప్లాప్స్ పడ్డాయి . పైగా విజయ్ దేవరకొండ హై రెమ్యూనరేషన్ కూడా ఛార్జ్ చేసిన దాఖలాలు లేవు.

మరి ఆయన అంత లగ్జరీస్ లైఫ్ని ఎలా గడుపుతున్నారు..? అంత లగ్జరీయస్ గా ఎలా బ్రతుకుతున్నారు.. అన్న విషయం ఇప్పుడు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. విజయ్ దేవరకొండకు జూబ్లీహిల్స్ లో 17 కోట్లు విలువ చేసే ఒక బంగ్లా ఉంది. ఇంటీరియర్ గార్డెన్ కూడా ఉంది. అదే విధంగా ఆయన వద్ద 10 కాస్ట్లీ కార్లు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది . అంతేనా సొంత జెట్ ప్లైన్ కూడా ఉందట . లగ్జరీ గా ఉండడంలో విజయ్ దేవరకొండ ను చూసే మన టాలీవుడ్ హీరోలు నేర్చుకోవాలి అన్న కామెంట్స్ కూడా వాళ్ళ ఫాన్స్ ట్రెండ్ చేశారు.

అయితే ఒక పక్క వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. మరొక పక్క విజయ్ దేవరకొండ ఆస్తుల లిస్టు మాత్రం పెరిగిపోతుంది .. ఇది ఎలా సాధ్యమవుతుంది..? విజయ్ దేవరకొండకు ఇంత డబ్బులు ఎలా వస్తున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే సినిమాలు ఫ్లాప్ అయినా సరే విజయ్ దేవరకొండ పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం కారణంగా ఆయనకు కోట్లల్లో ఆదాయం వస్తుంది అని అదేవిధంగా ఆయనకు పలు బిజినెస్ లు కూడా ఉన్నాయి అని .. విజయ్ దేవరకొండ కెరియర్ స్టార్టింగ్ లోనే పక్కాగా తన లైఫ్ను ప్లాన్ చేసుకున్నాడు అని సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ పైన నెలకు డబ్బులు వచ్చే విధంగా తన రెమ్యూనరేషన్ సెట్ చేసుకున్నాడు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!