“అపరిచితుడు” సినిమా వదులుకున్న ఆ తెలుగు హీరో ఇతనే.. చేసుంటే వేరే లేవల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమాలు మరొక స్టార్ హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణమే .. అది అందరికీ తెలిసిందే .. అయితే అలాంటి ఒక బిగ్ సూపర్ డూపర్ హిట్ సినిమా ..ఒక స్టార్ ఖాతాలో నుంచి మరొక స్టార్ ఖాతాలో పడితే ఆ బాధ వర్ణాతితం .. అలాంటి బాధలను కూడా మన స్టార్స్ ఎంతోమంది పేస్ చేశారు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోస్ ఎంతోమంది ఉన్నారు .. కానీ కింగ్ హీరో అంటే మాత్రం అందరికీ గుర్తొచ్చేది.. నాగార్జున .. అక్కినేని నాగార్జున తన కెరియర్ లో ఎన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడో కౌంటే లేదు .. అందులో ఒకటే ఈ అపరిచితుడు . అపరిచితుడు సినిమాను మొదటగా తెలుగులో నాగార్జున చేత నటింపజేయాలి అనుకున్నాడట శంకర్. అయితే నాగార్జున ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కు నేను సూట్ అవ్వను అంటూ చేతులెత్తేసాడట .

శంకర్ చాలా చాలా ట్రై చేసినా కూడా నాగార్జున ఒప్పుకోలేదట. ఆ తర్వాత పలువురు తెలుగు హీరోలకు ఈ కథ వినిపించిన .. ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించలేదట . దీంతో ఫైనల్లీ విక్రమ్ ఈ సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకునేలా చేసుకున్నాడు.. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎన్నెన్నో క్రేజీ రికార్డులను బ్లాస్ట్ చేసేసింది . ఇప్పటికీ ఈ సినిమా చాలామంది ఫ్యాన్స్ కి ఫేవరెట్ మూవీగా నిలుస్తుంది..!