పుష్ప 2 కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ముహూర్తం ఎప్పుడంటే..?!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిటీ దక్కించుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమాకు సీక్వల్ గా పుష్ప 2 ది రూల్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ తో పాటు.. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప పుష్పరాజ్ టైటిల్ సాంగ్, అలాగే సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి కపుల్ సాంగ్.. రెండు రిలీజై నెటింట‌ రికార్డులు సృష్టిస్తున్నాయి. మొదట ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Pushpa 2 Releasing on 15th August 2024 Allu Arjun Rashmika Mandanna Vijay  Sethupathi Movie Release date | Pushpa 2 The Rule: आज़ादी का जश्न होगा  दोगुना, क्योंकि इस दिन पर्दे पर फिर

అయితే తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. షూటింగ్ పార్ట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కాకపోవడంతో.. క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే టెక్నికల్ గా మరింత అత్యున్నత విలువలతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సినిమా తేదీని పోస్ట్ పోన్ చేసినట్లు మేకర్స్ వివరించారు. ఇక అల్లు అర్జున్, రష్మిక మందన హీరో.. హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో.. ఫాహద్ ఫాజిల్, ధనుంజరు, సునీల్, అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు.

నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్లు ప్రొడ్యూస‌ర్‌లుగా భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా ను రూపొందిస్తున్నారు. అయితే పుష్పా సినిమా బ్లాక్ బస్టర్ కావ‌డంతో దీనికి సిక్కుల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో మరింత పాపులారిటీ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ లక్షలాది మంది అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో సుకుమార్ బ‌న్నికి ఎలాంటి సక్సెస్ అందిస్తాడో వేచి చూడాలి.