అయ్యయ్యో.. రిలీజ్ కి ముందే ప్రభాస్ కల్కికి భారీ దెబ్బ తగిలిందా? ఏంటి ఈ బ్యాడ్ శకునం..!

కల్కికు బ్యాడ్ సెంటిమెంట్ ఎదురవుతుందా..? అంటే అవును అంటున్నారు సినీ ప్రముఖులు సినీ విశ్లేషకులు . నిజానికి కల్కి సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది . ఆయన సరే మంచి ముహూర్తం నాడేఅ రిలీజ్ అవ్వడానికి ఫిక్స్ చేసుకున్నాడు నాగ్ అశ్వీన్. జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 25వ తేదీ గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్.

కాగా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 26వ తేదీకి పోస్ట్ పోన్ చేశారట . దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అంటూ చెప్పుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఏపీ న్యూ సీఎం నారా చంద్రబాబు నాయుడుని ఇన్వైట్ చేశారట . పవన్ కళ్యాణ్..చిరంజీవి కూడా రాబోతున్నారట.

ఆయనకున్న కొన్ని బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను జూన్ 25వ తేదీ కాకుండా 26వ తేదీ ఫిక్స్ చేశారట. నాగ్ అశ్వీన్ కూడా దీనికి ఓకే చేశారట . అంతా మాట్లాడుకొని అన్ని ఫిక్స్ చేసుకున్నాక ఇలా ఒక ఈవెంట్ పోస్ట్ పోన్ అవ్వడం అది కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఈవెంట్ పోస్ట్ పోన్ అవ్వడం అభిమానులకి నచ్చడం లేదు . ఇది ఒక బ్యాడ్ శకునంగా ఫీల్ అవుతున్నారు..!!