నేడు బాలయ్య పుట్టినరోజు.. ఈ సందర్భంగా బాలయ్యకు సోషల్ మీడియా వేదికగా పలువురు ఫాన్స్ ..ఫ్రెండ్స్.. శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు అందరూ విష్ చేస్తూ వచ్చారు . ఆయనకు సంబంధించిన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి స్పెషల్ అనౌన్స్మెంట్లు కూడా ఇచ్చారు . బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాను అఫీషియల్ గా ప్రకటించేశారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు .
అయితే ఈ గ్లింప్స్ లో చాలా చాలా పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు బాలయ్య అనడంలో సందేహమే లేదు . కానీ ఇంతకుముందు వరకు బాలయ్య నటించిన సినిమాలకు ఈ సినిమాలకు ఏదో స్పెషల్ అపీరియన్స్ ఉంది అని ఒక విషయాన్ని దాచుతున్నారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రిలీజ్ అయిన గ్లింప్స్ లో ఒక్కటంటే ఒక్క బాలయ్య డైలాగ్ కూడా రివీల్ చేయలేదు . కేవలం ఆయన లుక్స్ మాత్రమే రివిల్ చేశారు.
బహుశా ఈ సినిమాలో బాలయ్యను ఏదైనా జబ్బు పాత్రలో చూపించబోతున్నారా ..? లేకపోతే రివేంజ్ తీర్చుకునే వ్యక్తి సైలెంటుగా చేసే పని ఇలానే ఉంటుంది అని చూపించబోతున్నారా..? ఏమో సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే .కానీ గ్లింప్స్ లో ఎక్కడా కూడా బాలయ్య డైలాగ్ లేకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అంటూ తెలుస్తుంది. దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాలల్లో బాగా బాగా వైరల్ గా మారింది..!!