అనుష్క డైరెక్టర్ తో రామ్ పోతినేని సినిమా..ఇదెక్కడి క్రేజీ కాంబో రా బాబోయ్..!?

రామ్ పోతినేని .. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే ఎనర్జిటిక్ స్టార్ అనగానే ఈపేరే అందరికీ వినిపిస్తుంది.. కనిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాం పోతినేని ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ పాత్రల్లో కనిపించిన నడిపించాడు ..మనకు తెలిసిందే.. కాగా ప్రజెంట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబల్ ఇస్మార్ట్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ రాం పోతినేని పునర్ వైభవం వస్తుంది అనడంలో సందేహం లేదు .

కాగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్తో ఒక సినిమాకి ఓకే చేశాడు రామ్ పోతినేని అంటూ ప్రచారం జరిగింది . త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి . అయితే అవన్నీ పుకార్లుగానే ఉండిపోయాయి . తాజాగా మరొక న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది . అనుష్క శెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను తెరకెక్కించిన పి మహేష్ దర్శకత్వంలో..

రామ్ పోతినేని ఒక సినిమాలో నటించబోతున్నాడు అని .. ఈ సినిమా కూడా పూర్తి డిఫరెంట్ షేడ్స్ లో తెరకెక్కబోతుంది అన్న వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . ఈ సినిమా కోసం రామ్ పోతినేని రిస్క్ చేయబోతున్నారట . ఇప్పటివరకు సినిమా కెరియర్ లో ఎప్పుడు కనిపించని వైవిద్య భరితమైన పాత్రలో నటించబోతున్నారట . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడట రామ్..!