ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు. కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రభాస్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత బాహుబలితో హిట్ కొట్టిన ప్రభాస్ మళ్లీ కల్కి సినిమాతో అంతటి హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ దీని పట్ల హ్యాపీగా ఉన్న ఒక డైరెక్టర్ మాత్రం డీలా పడిపోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన మరెవరో కాదు మారుతి .
ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ది రాజా సాబ్. ఈ సినిమా విషయంలో ప్రభాస్ చాలా చాలా స్ట్రిక్ట్గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . కల్కి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయింది . ఇప్పుడు ఆ తర్వాత వచ్చే సినిమాల్లో కూడా అదే రేంజ్ హిట్ అయితేనే ప్రభాస్ పరువు నిలబడుతుంది. ఏ డైరెక్టర్ ఏమాత్రం తప్పు చేసినా..
ఆ డైరెక్టర్ నెగిటివిటీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ 2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది . అందులో నో డౌట్ . మారుతి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయితేనే ప్రభాస్ ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు ..అటూ ఇటూ ఏమాత్రం సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ చేతిలో డైరెక్టర్ మారుతి బలి కావాల్సిందే అంటూ మాట్లాడుకుంటున్నారు.