“కల్కి” సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ ప్రభాస్ ఆ పని చేయక తప్పదా ..? ఫ్యాన్స్ కూడా ఒప్పేసుకుంటున్నారే..!!

ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడే నెగెటివిటీ ఉంటుంది .. ఎక్కడ పొగిడే వాళ్ళు ఉంటారో.. అక్కడ తిట్టేవాళ్ళు కూడా ఉంటారు.. ఆఫ్ కోర్స్ దేవుడు ఉన్నచోటే దయ్యం కూడా ఉంటుంది అంటూ మన ఇంట్లోనే పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు . అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాపై కూడా అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి . టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే దిశాపటాని హీరోయిన్లుగా నటించిన సినిమా కల్కి .

ఈ సినిమా జూన్ 27వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ బాగానే కష్టపడ్డాడు . అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ చూసిన జనాలు సైతం ప్రభాస్ ఈ సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ ధీమా వ్యక్తం చేశారు . అయితే ప్రభాస్ ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఫ్లాప్స్ పడి సలార్ సినిమాతో హిట్టు అందుకున్న ప్రభాస్ ఒకవేళ కల్కి సినిమా అటూ ఇటూ అంటూ నెగటివ్ టాక్ దక్కించుకుంటే మాత్రం ఆయన పెళ్లి చేసుకోవడమే ఉత్తమం అని సజెస్ట్ చేస్తున్నారు . సినీ విశ్లేషకులు కూడా ఇదేవిధంగా మాట్లాడుతూ ఉండడం గమనార్హం. అయితే ప్రభాస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది..!!