టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నేడు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతిని గుర్తు చేసుకుంటూ తన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నాడు. తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నా. నా గుండె లోతుల్లో నా ప్రతి జ్ఞాపకంలో మీరు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తండ్రి కృష్ణ ఫోటో తో పాటు తన ప్రేమను ఇమేజిస్ రూపంలో షేర్ చేసుకున్నాడు మహేష్‌బాబు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ ఓ పాటు.. కృష్ణ ఫ్యాన్స్ కూడా ఆయనను గుర్తు చేసుకుంటూ ఎమొషనల్ అవుతున్నారు.
కాగా కృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ గా, నిర్మాతగా, హీరోగా అన్ని రంగాల్లోనూ తనను తాను ప్రూవ్ చేసుకున్న కృష్ణ.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. వందలాది హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన సూపర్ స్టార్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నాడు. 2022లో హార్ట్ ఎటాక్ తో కృష్ణ మృతి చెందడం కోట్లాదిమంది అభిమానులను కలచివేసింది. ఇప్పటికి కృష్ణని మర్చిపోలేని ఆయన అభిమానులు ఎన్నో సినిమాలను పదేపదే చూస్తూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కృష్ణ గారి సినీ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే.
అయితే కృష్ణ వారసుడికి వచ్చిన మహేష్ బాబు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో అదే రేంజ్ లో సక్సెస్ సాధిస్తున్నాడు. వరుస సినిమాలతో తన క్రేజ్ ను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమయ్యాడు మహేష్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. అయితే రాజమౌళి డైరెక్షన్లో మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మహేష్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో సక్సెస్ కాయం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram