బాలయ్య వివాదంపై సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్.. రాజకీయ బలం నుంచి వచ్చాడంటూ..?!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ గా హాజరైన బాలయ్య.. అంజలిని తోసేసారంటూ ఆయన ప్రవర్తన అనుచితంగా ఉందంటూ.. అతనిపై నెగిటివిటి బాగా వైరుల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో అందరి ముందే వాటర్ బాటిల్ లో మద్యం తీసుకుని.. ఆయన రచ్చ చేశాడంటూ బాలయ్య పై నెగిటివ్ వార్తలు వైరల్ గా మారాయి.

Was Nandamuri Balakrishna drunk when he pushed Anjali? Gangs of Godavari  makes deny, blame CGI

దీనిపై స్పందించిన వీడియోను చూసి వారంతా బాలయ్య తీరుపై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ సంఘటనపై సింగర్ చిన్మయి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను గమనించిన అతిపెద్ద సమస్యల్లో ఇదే మొదటిది. ఆమె నవ్వును చూడండి.. ఆమెకు ఉండాలి కదా.. ఆమెకే ఎలాంటి బాధ లేనప్పుడు ప్రేక్షకులు రియాక్షన్ పై స్పందించడం సాధ్యం కాదు. ఎందుకంటే మోరల్ పోలీసింగ్ కంటే పవర్ఫుల్. హరీస్చంద్ర, శ్రీరామచంద్రమూర్తిలాంటి వారి బంధువులు అవతారాలు అర్థం చేసుకోవడం పొరపాటే.

Anjali Gets Trolled for Defending Balakrishna Act of Pushing Her: Forced  Tweet Lag Raha Hai

పవర్ లో ఉన్న వారిని తప్పుగా చూపించేందుకు ఈ సమాజం అసలు ఒప్పుకోదు. ముఖ్యంగా డబ్బు, కులం, రాజకీయ బలం ఉన్న వారిని ఇందులో మీకు ఎలాంటి నష్టం లేనప్పుడు మహిళలకు ఎలా ప్రవర్తించాలో చెప్పకండి అంటూ వివరించింది. అలాగే ఈ సంఘటనపై స్పందించిన వీడియోను కూడా ఆమె షేర్ చేసుకుంది. ప్రస్తుతం చిన్మ‌యి చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో,. చిన్మయిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏదైనా ఒక చిన్న సంఘటన దొరికితే చాలు నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తారు అంటూ.. అసలు వ్యక్తికి ఏం బాధ లేకపోయినా వీరు ఫీల్ అయిపోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.