మెగా డాటర్ నిహారికకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తర్వాత జొన్నలగడ్డ చైతన్య వివాహం చేసుకున్న ఈ చిన్నది.. కొంతకాలానికి మనస్పర్ధలు కారణంగా అతనికి డివోర్స్ ఇచ్చేసి ఒంటరిగా ఉంటుంది. ప్రస్తుతం లైఫ్ నుంచి ఎంజాయ్ చేస్తున్న నిహారిక.. నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి సినిమాలను తెరకెక్కిస్తూ హీరోయిన్గా ఓ సినిమాలో నటిస్తుంది.
సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ రోజుకో పోస్ట్ తో సందడి చేస్తుంది. నిహారిక పెట్టే ప్రతి పోస్ట్ నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెకేషన్ లోకి వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు.. తాజాగా తన తండ్రి నాగబాబుతో మినీ డేట్ ను ప్లాన్ చేసింది. ఆ మినీ డేట్ కు సంబంధించిన ఒక క్యూట్ వీడియోను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ విషయాన్ని నిహారిక స్వయంగా తెలుపుతూ షేర్ చేసిన వీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
తండ్రికి ముద్దులు పెడుతూ తన ప్రేమను చూపించింది. ఇక నిహారికకు నాగబాబు అన్నా.. నాగబాబుకి నిహారిక అన్న ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటారు. అయితే మెగా డాటర్ తాజాగా ఈ వీడియోను షేర్ చేస్తూ మరోసారి తన ప్రేమను చూపించింది. ఇక ప్రస్తుతం ఆ వీడియో చూసిన నెటిజన్స్ తండ్రీ కూతుర్ల ప్రేమ ఎప్పటికీ ముగిసిపోదని.. వావ్ వీరిద్దరి బాండింగ్ ఎంత క్యూట్ గా అనిపిస్తుంది అంటూ.. తండ్రికి ఎప్పుడు తన కూతురు ప్రిన్సెసే అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram