టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాజల్ ప్రధాన పాత్రలో నటించిన సత్యభామ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రైమ్ థ్రిల్లర్ కథతో సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించాడు. జూన్ 7న సత్యభామ గ్రాండ్ లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మేజర్ మూవీ డైరెక్టర్ శశికిరణ్ తిక్క అందిస్తున్నాడు. ఇక తాజాగా మూవీ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ లెవెల్లో జరిగింది.
సత్యభామతో నా కెరీర్ లో కొత్త ఎక్స్పెరిమెంట్ చేశా అని.. ఇలాంటి క్యారెక్టర్ మూవీ చేయడం నాకు ఇదే మొదటిసారి.. ఈ సినిమా కథ వినగానే నచ్చేసింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అందుకే సినిమా చేసేందుకు ఆసక్తి చూపానని.. నేను ఎలాంటి కథలో క్యారెక్టర్స్ లో నటించాలనే ఆలోచనలేమి లేవని.. మంచి కంటెంట్ ఉంటే ఏ జోనర్ సినిమా అయినా నటించడానికి సిద్ధంగా ఉన్న అంటూ ఆమె వివరించింది. సత్యభామ కంటే ముందు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా ఆఫర్లు చాలా వచ్చాయని.. అయితే నేను ఆ మూవీస్ చేసేంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడే ఒప్పుకోవాలని భావించ అంటూ చెప్పుకొచ్చింది.
లేడీ ఓరియంటెడ్ సినిమాలు నటించేటప్పుడు నాపై ప్రెషర్ ఉంది అనుకోవడం కంటే.. నాపై బాధ్యత ఉందని భావిస్తా. ఈ సినిమాలో కొత్త ఎమోషన్స్ ఉంటాయి. ఫస్ట్ టైం యాక్షన్ భారీ స్టాంట్స్ చేశా.. వాటి కోసం చాలా శ్రమించా.. సత్యభామ నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు.. ఇది నా కెరీర్లో మరో కొత్త స్టేజ్ కి వెళ్తుందని చెప్పుకొచ్చింది. యాక్టింగ్ నా ఫ్యాషన్. అందుకే నా పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఓ పక్క పర్సనల్ లైఫ్, మరోపక్క ప్రొఫెషనల్ లైఫ్ రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది అంటూ వివరించింది. నాకు ఫుల్ లెన్త్ యాక్షన్స్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో డ్రీమ్ అని.. సత్యభామతో ఆ కోరిక కూడా తీరిపోయింది అంటూ వివరించింది కాజల్.