‘ కల్కి ‘ కోసం మేము చేస్తున్న సాహసోపేత ప్రయోగం ఇది.. నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్..?!

పాన్ ఇండియ‌న్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మహానటి ఫేమ్ నాగార్జున దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898ఏడి. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవెల్ లో భారీ హైప్ నెలకొంది. ప్రభాస్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాని లాంటి టాప్ స్టార్స్ అందరూ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Director Nag Ashwin to release Kalki 2898 AD official trailer in March 2024  - Deets Inside | Telugu Movie News - Times of India

అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మూవీ డైరెక్టర్ నాగ అశ్విన్ మాట్లాడుతూ సినిమా రిలీజ్ కంటే ముందే యానిమేషన్ సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ ట్రైలర్ గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్ లో లాంచ్ చేశారు. దీనిపై డైరెక్టర్ నాగ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ యానిమేషన్ సిరీస్ అనేది నిజంగా కొత్త ప్రయత్నం.

Kalki 2898 AD: Interesting trailer of Bujji & Bhairava animated series  launched | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

చోటా భీమ్ తో పాటు ఎన్నో యానిమేషన్ సిరీస్లను రూపొందించిన గ్రీన్ గోల్డ్ సంస్థతో కలిసి పని చేసాం. అయితే సినిమా కంటే ముందే యానిమేషన్ ట్రైల‌ర్ రిలీజ్ చేయడం మా సంస్థ చేసిన సాహసోపేత ప్రయోగం అంటూ దర్శకుడు అశ్విన్ వివరించాడు. ఈ యానిమేషన్ సిరీస్ కోసం వైజయంతి ఆటోమొబైల్స్, వైజయంతి యానిమేషన్స్‌, వైజయంతి మూవీస్ ఇలా మూడు డిఫరెంట్ కంపెనీలను నడిపించామని.. సగవరవంగా తెలియజేస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగ అశ్విన్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.