తెలుగు, తమిళ్ భాషలో విజయ్ ఆంటోని పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విజయ్ ఆంటోని సినిమాలలో బిచ్చగాడు, బిచ్చగాడు సీక్వెల్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి సక్సెస్ అందుకుంది. దీంతో విజయ్ అంటోని తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. అయితే తాజాగా విజయ్ ఆంటోని లైఫ్ లో ఎప్పటికీ చెప్పులు వేసుకోనంటూ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు వివరించాడు. కొద్ది రోజుల్లో విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ఈ షాకింగ్ విషయాన్ని రివెల్ చేశాడు. నేను గత 90 రోజుల నుంచి చెప్పులు వేసుకోవడం లేదని.. అందరూ నేను ఏదో దీక్ష చేస్తున్నానని.. అందుకే చెప్పులు లేకుండా నడుస్తున్నాను అనుకుంటున్నారు.. కానీ అలాంటిదేం లేదు.
ఒకరోజు చెప్పులు లేకుండా నడిస్తే.. ప్రశాంతంగా అనిపించింది. చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిదని ఆయన వివరించాడు. చెప్పులు లేకుండా నడవడం మనపై మనకు నమ్మకాన్ని కలిగిస్తుందని.. అలా తిరగడం వల్ల నేను ఒత్తిడికి గురికాకుండా ఫ్రీగా ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో లైఫ్ లాంగ్ చెప్పులు వేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను అంటూ వివరించాడు. విజయ్ ఆంటోనీ నిర్ణయం మంచి నిర్ణయం అయినా.. అది పాటించేటప్పుడు ఫ్యూచర్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. వేసవిలో చెప్పులు వేసుకోకుండా సెకండ్లు నడవాలని చాలా కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే విజయ్ ఆంటోని వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు కారణంగానే అస్ట్రస్ తట్టుకోలేక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని.. నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాల విషయంలో విజయ్ ఆంటోని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ రోజురోజుకు పెరుగుతూ ఉండడం విశేషం. ఈయన రేంజ్ రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బిచ్చగాడు సీక్వెల్3.. 2026 లో రిలీజ్ అవుతుందని విజయ్ ఆంటోనీ వివరించాడు.