కోడలు పిల్లతో రొమాన్స్ నా..? ఏంటి నాగ్ మామ ఇది..!

తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ నాగార్జున తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అక్కినేని అభిమానులకు మండిపోయేలా చేస్తుంది. ఎస్ ఇండస్ట్రీలో మన్మధుడిగా కింగ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున త్వరలోనే తన 100వ సినిమా అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాడు . ఈ సినిమా కోసం చాలా స్థాయిలో కష్టపడి పోతున్నాడు కింగ్ అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి . ఇది చాలా చాలా ప్రత్యేకమైన మూవీగా ఆయన అనౌన్స్ చేయబోతున్నాడట.

ఈ సినిమాలో తన లక్కీ బ్యూటీ త్రిషను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శోభిత ధూళిపాళను చూస్ చేసుకున్నారట . శోభిత ధూళిపాల పేరు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎలా వైరల్ అయిందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపించాయి . వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా ట్రెండ్ అయ్యాయి .

ఇప్పుడు ఏకంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు ట్రెండ్ అవుతున్న క్రమంలో అక్కినేని నాగార్జున వందవ సినిమాలో హీరోయిన్గా శోభిత ధూళిపాళ కీలకపాత్రలో కనిపించబోతుంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . కొంతమంది దీనిని వెటకారంగా వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు . నాగ్ మామ మజాకా ..కోడలు పిల్లలతో రొమాన్స్ అంటూ నాటి నాటిగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . చూడాలి మరి దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో..??