ఆ విషయంలో ప్రభాస్-తారక్-బన్నీ ఓకే..మరి రామ్ చరణ్ ఆన్సర్ ఏంటి..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా హీరోలు ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల పైనే రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు . సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది . ఈ విషయంపై మేకర్స్ లబోదిబో అంటున్నారు . పోనీ అన్నని కోట్లు వేసి రెమ్యూనరేసహ్న్ ఇస్తున్న ఆ సినిమాలు హిట్ అవుతున్నాయా..? అంటే అరాకొరా మాత్రమే హిట్ అవుతున్నాయి .

మిగతావన్నీ ప్లాప్ అవుతున్నాయి . దాని రిజల్ట్ కూడా మనం లైవ్ లోనే చూస్తున్నాం . రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ – తారక్ – బన్నీ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . అదేవిధంగా రామ్ చరణ్ సైతం 100 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్ నటిస్తున్న కల్కి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది . ఈ సినిమా కాన్సెప్ట్ ఇప్పటివరకు ఎవరు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు .

అదే విధంగా ఎన్టీఆర్ దేవర.. బన్నీ పుష్ప2పై కూడా హై ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి . ఈ సినిమా కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం ఓకే ..మరి రాంచరణ్ బుచ్చిబాబు సనా సినిమా కోసం 100 కోట్లు తీసుకుంటూ ఉండడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాల్లో తెరకెక్కుతుంది . ఈ సినిమా కోసం అంత ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో ఎందుకు రామ్ చరణ్ సడన్గా అంత రెమ్యూన్రేషన్ పెంచేశాడు అనే వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . సడన్గా ఈ సినిమాకి 100 కోట్లు ఛార్జ్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!