“చరణ్-తారక్ నా చేతికి దొరికితేనా..?”..స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్ వైరల్..!

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ – తారక్ పేర్లు ఏ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా అంతకుముందు రామ్ చరణ్ తారక్ ల పేర్లు బాగా మారుమ్రోగిపోతున్నాయో మనకి తెలుసు. ఆఫ్ కోర్స్ తెలుగు ఇండస్ట్రీ హీరోలు కాబట్టి వాళ్ల పేర్లు ఇక్కడ మారుమ్రోగిపోవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు . అయితే ఆర్ ఆర్ ఆర్ తర్వాత గ్లోబల్ స్థాయిలో వాళ్ల పేర్లు ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం . అంతేకాదు హాలీవుడ్ హీరోయిన్స్ సైతం పొగిడేస్తున్నారు.

ఎంతలా అంటే వాళ్లపై హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు రీసెంట్గా హాలీవుడ్ హాట్ బ్యూటీ “అన్న హద్వే” తారక్ చరణ్ లపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . అన్న హాత్వే తెలుగు జనాలకి ఈ పేరు కొత్తదేమో.. కానీ హాలీవుడ్ జనాలకు మాత్రం బాగా సుపరిచితమైన పేరే .. తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ మెప్పిస్తూ వచ్చింది. రీసెంట్గా నటించిన “ఐడియా ఆఫ్ యు ” అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది .

ఈ సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆమె ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. అంతేకాదు ఎన్టీఆర్ రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది అని అలాంటి అవకాశం వస్తే అసలు మిస్ చేసుకోనని కచ్చితంగా ఒకరిని పట్టేసుకుని సినిమాలో నటిస్తాను అని మీడియా ముందే చెప్పడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రెసెంట్ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా ప్రెసెంట్ రాంచరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి చూస్తున్నాడు . అదేవిధంగా ఎన్టీఆర్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . అదేవిధంగా వార్ 2 కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు . హృతిక్ రోషన్తో ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నాడు తారక్..!!