కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఊహించిన రెంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. దీంతో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ గా నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా పాపులారిటి దక్కించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ ఏడాదిలో రిలీజై పాన్ ఇండియా లెవెల్‌లో మంచి సక్సెస్ అందుకున్న హనుమాన్‌తో మరింత పాపులర్ అయింది.
అయితే ఇటీవల ఈమె బిజినెస్ మ్యాన్ నికోలయ్ సచ్ దేవ్‌ను ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం జులైలో థాయిలాండ్ లో గ్రాండ్ లెవెల్లో జరగబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పెళ్లి పనుల్లో బిజీగా ఉందట. థాయిలాండ్ లో పెళ్లి పనులు చూస్తున్నట్లు వీరి రిసెప్షన్ చెన్నైలో తాజ్ హోటల్, లిల్లీ ప్యాలెస్ లలో గ్రాండ్ లెవెల్ లో జరగనుందని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ వార్త నెటింట వైరల్ గా మారింది. ఇక తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బి ఎల్, క్రాక్, నాంది, యశోద లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో పవర్ ఫుల్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల లేడీ ఓరియంటెడ్ మూవీ శబరితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది.