అబ్బాయిలు ఆగండి.. దానికి కొంచెం టైం ఉంది.. ఫ్యాన్స్ కు ఫరియా క్రేజీ రిక్వెస్ట్..

యంగ్‌ బ్యూటి ఫ‌రీయా అబ్దులాకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ లో సంపాదించుకుంది. నటనకు మంచి మార్కులు దక్కించుకున్న ఫరీయా.. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఇటీవల మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది.

Faria Abdullah: అందాలందు ఈ అందం వేరయా.. 'ఫరియా అబ్దుల్లా' హాట్ ట్రీట్  ఫొటోస్. - Telugu News | Faria Abdullah new sizzling photos goes attractive  in social media 16 07 2023 Telugu Actress Photos | TV9 Telugu

అయితే సినిమాల విషయంలో అంతంతమాత్రంగానే ఉన్న ఈ అమ్మ‌డు సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలు ఆరబోస్తూ ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతుంది ఫరియా. రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదిక‌గా ఫరీయాకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ చాలా మంది ఫ్యాన్స్ ఆమెకు మెసేజెస్ చేశారు.

ఇందుకు సంబంధించిన పోస్ట్లు ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. నాకు విషెస్ తెలిపినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. కానీ ఈ విషెస్ ను జూన్ 21 వరకు హోల్ లో పెట్టండి. ఎందుకంటే ఈ రోజు నా బర్త్ డే కాదు అంటూ ఆమె క్రేజీ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఫ‌రీయా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో అంతా ఫుల్ గా నవ్వుకుంటున్నారు. ర‌క‌ర‌కాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.