“సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ”..పుష్పరాజ్ -శ్రీవల్లి చించిపడేశారు పో..(వీడియో)..!!

సుకుమార్ ..మామూలోడు కాదు ..అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి . దానికి కారణం కొద్దిసేపటి క్రితమే పుష్ప2 నుంచి రిలీజ్ అయిన సెకండ్ పాట . వామ్మో ఆ లిరిక్స్ ఏంటి..? ఆ స్టెప్స్ ఏంటి ..? ఆ గ్రేస్ మూమెంట్స్ ఏంటి ..? ఒక్కొక్కడికి ఇచ్చి పడేసాడు సుకుమార్ . ఎవరైతే పుష్ప2 సినిమాకి అంత సీన్ లేదు కేవలం అది మాఫియా కి సంబంధించిన సినిమా అంటూ రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేశారో వాళ్లందరికీ ఒక్క దెబ్బతో నోరు మూయించే విధంగా ఆన్సర్ ఇచ్చాడు సుకుమార్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పాట్ లిరిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి .

ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి సెకండ్ పాట ని రిలీజ్ చేసింది చిత్రం బృందం . ఈ పాటను శ్రేయ ఘోషల్ తన అద్భుతమైన గొంతుతో చాలా చక్కగా ఆలపించింది . మరీ ముఖ్యంగా పుష్పరాజ్ గాడి కటౌట్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే లిరిక్స్ ఈ పాటకు ఉండడం గమనార్హం . అదేవిధంగా శ్రీవల్లి పాత్రలో రష్మిక కూడా చించిపడేసింది అని చెప్పాలి .

“మొరటోడు.. మండోడు ..అయినా మంచివాడే నా సామి ..సూసేటి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి” అని పుష్ప రాజ్ గాడి కటౌట్ క్వాలిటీస్ గురించి పర్ఫెక్ట్ గా ఈ పాట ఉంది . అంతేకాదు ఈ పాట లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . అంతేనా ఈ పాటలో రష్మిక అల్లు అర్జున్ హగ్ చేసుకుని వేసిన స్టెప్ ఈ పాటకి హైలెట్గా మారింది. ప్రెసెంట్ ఈ పాటకు సంబంధించిన పిక్చర్స్ లిరిక్స్ బాగా నెట్టింత వైరల్ గా మారాయి . సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది పాట అని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికి సుకుమార్ ఈ సినిమాతో గ్లోబల్ స్ధాయిలో రికార్డ్స్ బద్దలు కొట్టడం పక్కా అని మాత్రం ప్రూవ్ అయిపోయింది . మరి ఎందుకు ఆలస్యం ఆ స్వామి పాట మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..!!