కొన్ని కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ రాకముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి . అలాంటి సినిమాలలో ఒకటే మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమా . మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మనకు బాగా తెలుసు రాజమౌళితో వర్క్ చేయడం అంత ఈజీ కాదు. కానీ వర్క్ చేసి మెప్పిస్తే వచ్చే హిట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంటుంది .
రాజమౌళి పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడం పెద్ద టఫ్ జాబ్ .. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు దాదాపు 12 కేజీలు బరువు తగ్గాడట . అయితే తాజాగా మహేష్ బాబు బావ సుధీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంత కష్టపడుతున్నాడు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు .. రాజమౌళి సినిమా కోసం మహేష్ మెంటల్గా ఫిజికల్ గా చాలా చేంజ్ అవుతున్నాడు.. తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు.. నిజం చెప్పాలంటే మహేష్ బాబుని ఎప్పుడూ కూడా నేనుఇలా చూడలేదు..
మహేష్ ఫుడ్ విషయంలో చాలా క్యాలిక్యులేషన్ చేసుకునే డైట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడైతే అన్ని తింటున్నాడు .. కానీ కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నాడు . అదంతా రాజమౌళి ట్రిక్ .. ఫుడ్ విషయంలో ఎటువంటి కంట్రోల్ లేకుండా బీభత్సంగా కుమ్మి పడేస్తున్న మహేష్ బాబు ఫిజిక్ మైంటైన్ చేసే విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అంటూ చెప్పుకు వచ్చారు. దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు పై తన బావ సుధీర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!