హమ్మయ్య..ఇన్నాళ్లకి ఆ విషయంలో బల్బ్ వెలిగిందా విజయ్ దేవరకొండా..?

సినిమా ఇండస్ట్రీలో సినిమాలో నటిస్తే సరిపోదు.. ఆ సినిమాలను ప్రమోట్ చేసుకోగలగాలి .. ఎంతసేపు హై రేంజ్ లో కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తే సరిపోదు .. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెప్పించాలి . ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్నాడు విజయ్ దేవరకొండ . అందుకే ఇప్పుడు రూట్ మొత్తం మార్చేశాడు . ఫ్యామిలీ స్టార్ సినిమాతో హ్యూజ్ డిజాస్టర్లు తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ ప్రజెంట్ తన కెరియర్ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా రాహుల్ సంకృత్యన్ తో విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.

ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా బ్రిటిష్ వారి కాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కబోతుందట . మరీ ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుందట . రష్మిక తో పాటు మరొక హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించబోతుందట . 19వ శతాబ్దానికి చెందిన పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో దీన్ని తెరకెక్కించబోతున్నారట . కొత్త కాన్సెప్ట్ పోస్టర్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే .

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు . టాక్సీవాలా- శ్యాం సింగరాయ్ సినిమాలతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు చాలా చాలా డిఫరెంట్ టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం “రణభాలి” అనే టైటిల్ను రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తుంది . ఈ సినిమా చాలా వైవిధ్య భరితంగా ఉండబోతుందట . మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారట . ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!