“అందుకే పెళ్లి చేసుకోవడం లేదు”..ఇన్నాళ్లకి అసలు నిజాని బయటపెట్టేసిన అంజలి..!!

అంజలి తెలుగు అమ్మాయి ..కానీ తెలుగులో కన్నా ముందుగా కోలీవుడ్ లో బాగా పాపులారిటీ సంపాదించుకొని.. అక్కడ అవకాశాలు దక్కించుకొని .. తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని.. ఫైనల్లీ తెలుగు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు దక్కించుకుంది ..ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారుతుంది . అంజలి చేతిలో పలు సినిమాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా అంజలి గేమ్ చేంజర్ సినిమాలో సెకండ్ లీడ్ పాత్ర పోషిస్తూ ఉండడం అభిమానులకు సైతం బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే అంజలికి ఎప్పుడు పెద్ద పెద్ద హీరోలు అవకాశాలు ఇవ్వరు .

అంతేకాదు రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లోను అంజలి ఓ రేంజ్ లో అల్లాడించేసింది . ఏకంగా బూతు పదాన్ని అవలీలగా వాడేసి .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అంజలి. మళ్లీ ఈ ఇంటర్వ్యూలు అంజలికి అదే ప్రశ్న ఎదురైంది. ” అంజలి పెళ్లి చేసుకోబోతుంది అని ..కొందరు స్టార్ డైరెక్టర్ని పెళ్లి చేసుకుంటుంది అని.. మరికొందరు ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చేసింది అని ..మరికొందరు పుకార్లు పుట్టిస్తున్నారు “..ఇదే విషయాన్ని హోస్ట్ ప్రశ్నించారు.

అయితే అంజలి చాలా ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చింది . “నాకు సోషల్ మీడియాలో పెళ్లి చేసేస్తూనే ఉంటారు.. మా ఇంట్లో వాళ్ళు దీని గురించి ఎప్పుడూ నన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు.. ఒకానొక సమయంలో మా అక్క కాల్ చేసి పెళ్లి చేసుకున్నావా..? నిజమా..? అంటూ నన్ను అడిగింది”. ఒకవేళ ఇప్పుడు నిజంగా నేను ఇతడే నా బాయ్ ఫ్రెండ్ అంటూ ఇంటికి తీసుకెళ్ళినా సరే నన్ను ఎవరు నమ్మరు అలాంటి పరిస్థితి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది “. అంతేకాదు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని .. కెరియర్ – పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ఒకే విధంగా చేయడం చాలా తప్పు అని.. అందుకే సినిమా ఇండస్ట్రీలో కొంచెం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను అని ..అందువల్లే పెళ్లిని దూరం పెడుతున్నానే తప్పిస్తే మరి ఏ కారణం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది . దీనితో అంజలి అభిమానులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు..!