“ప్రభాస్ కి ఆ పొగరు ఎక్కువ”.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్..!?

ప్రభాస్ గురించి ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా నెగిటివ్గా మాట్లాడిన సందర్భాలే లేవు. అది ఎందుకో కూడా మనకు తెలిసిందే . ఎందుకంటే అసలు ఆయనలో ఆ నెగటివ్ కోనమే లేదు. మంచితనానికి నిలువెత్తు రూపమే ప్రభాస్.. ఆరడుగుల అందగాడు.. అడుగు అడుగున కూడా మంచితనాన్ని నింపుకొని ఉంటాడు . ఎదుటి వాళ్ళు వచ్చి తూ ఛీ అన్న కూడా తుడిచేసుకొని వెళ్ళిపోయే టైప్ ఈ రెబల్ హీరోది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ కల్కి సినిమా ప్రమోషన్స్లో బిజీ బిజీగా ముందుకు వెళ్ళిపోతున్నాడు ప్రభాస్.

కాగా ఇలాంటి క్రమంలోనే ఆయనకు సంబంధించిన మరికొన్ని వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా ప్రభాస్ జాన్ జిగిడి అయిన గోపీచంద్ ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా సరే ప్రభాస్ కి సంబంధించిన క్వశ్చన్స్ కచ్చితంగా అడుగుతారు . గతంలో ఓ షోకి గెస్ట్ గా హాజరైన గోపీచంద్.. ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ మరొకసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. గోపీచంద్ ..ప్రభాస్ గురించి ఆల్మోస్ట్ జనాలకి తెలియని సీక్రెట్ లు అన్ని కూడా ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టారు .

కాగా “ప్రభాస్ కి కోపం వస్తే చాలా చాలా కఠినంగా మారిపోతాడు అని .. ఆ టైంలో నోటి నుంచి బూతు డైలాగ్స్ కూడా వస్తాయి అని.. కానీ అవంతా కొంచెం సేపు వరకే అని.. ఆ తర్వాత ప్రభాస్ మళ్ళీ తానే వచ్చి అందరితో కలిసి పోతాడు అని ..వెరీ వెరీ హంబుల్ పర్సన్ అని ..ఈగో అసలు లేదు అని.. కానీ లేడీస్ విషయంలో మాత్రం ప్రభాస్ చాలా రెస్పెక్ట్ ఫుల్ గా ఉంటాడు అని .. తన ముందు అమ్మాయిలను బూతులు తిడితే మాత్రం ఆ టైంలో ఆయన పొగరు హెడ్ వెయిట్ ఎక్కిపోతుంది అని ..వాళ్ళకి ఏదో ఒక విధంగా ఘాటుగా కౌంటర్ వేస్తాడు అని ..ఈ విషయం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు అని ..అమ్మాయిలు విషయంలో ప్రభాస్ చాలా చాలా సాఫ్ట్ నేచర్ కలిగిన వ్యక్తి అని” గోపీచంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!