అందరి హీరోయిన్స్ వేరు నయనతార వేరు ..ఆ ఒక్క విషయంలో చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!

ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా నయనతార పేరు చెప్తే వచ్చే అరుపులు కేకలు ఓ విధంగా ఉంటాయి . అది ఎందుకో కూడా అందరికీ తెలిసిందే . సౌత్ ఇండియాలోనేస్ట్ హీరోయిన్ అంతేనా సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ . ఒకటా..? రెండా..?చెప్పుకుంటూ పోతూ ఉంటే నయనతార గురించి పెద్ద చరిత్ర వస్తూ ఉంటుంది . అందుకే కోలీవుడ్ జనాలు ఆమంటే పడి చచ్చిపోతూ ఉంటారు . పెళ్లి అయిపోయిన సరే ఇప్పటికి హీరోయిన్గా ఓ రేంజ్ లో అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ అంటే కారణం మాత్రం ఆమెకు ఉన్న టాలెంట్ అని చెప్పాలి.

ఎటువంటి సీన్స్ అయినా సరే సింగిల్ టేక్ లో ఓకే చేయడం ఆమె స్పెషాలిటీ . అది సిస్టర్ పాత్ర అయినా.. తల్లి పాత్ర అయినా ..హీరోయిన్ పాత్ర అయినా బోల్డ్ పాత్ర అయినా ఎలాంటి రోల్ అయినా సరే మల్టీ టాలెంటెడ్ హీరోయిన్. సింగిల్ టేక్ లోనే ఓకే చేస్తుంది. అంతేకాదు నయనతార అంటే స్టార్ హీరోలు కూడా ఎక్కువగా ఇష్టపడడానికి ఆమెను తమ సినిమాలో పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. నయనతార కండిషన్స్ పెడుతుంది కానీ ఆ కండిషన్స్ కరెక్ట్గా ఫాలో అవుతుంది . అంతేకాదు చాలా డెడికేషన్ పర్సన్ … షూట్ కి టైం కి వస్తుంది తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది.. మాట ఇచ్చిందంటే తప్పదు సినిమా కమిట్ అయింది అంటే ఆ సినిమాని మరోసారి రిజెక్ట్ చెయ్యదు.

కానీ సినిమాకి మాత్రం ప్రమోషన్స్ చేయను అంటూ తెగేసి చెప్పేస్తుంది. కాగా మిగతా హీరోయిన్స్ అందరూ ఒక సినిమాకి కమిట్ అయ్యి వేరొక సినిమాలో హై రెమ్యూనరేషన్ ఇస్తాము అంటే ఉన్న సినిమాను వదిలేసి వెళ్ళిపోతారు. కానీ నయనతార ఆ టైప్ కాదు ఒక సినిమాకి కమిట్ అయ్యి పక్క సినిమా వాళ్లు పది కోట్లు ఇస్తామన్న ఆ కాల్ షీట్స్ పక్క వాళ్లకు ఇవ్వదు . నయనతార లో ఉన్న బిగ్ ప్లస్ పాయింట్ ఇదే. అందుకే ఆమెను జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . ప్రజెంట్ తెలుగు – తమిళం – హిందీ సినిమాలతో బిజీగా ముందుకు దూసుకెళ్తోంది హీరోయిన్ నయనతార..!!