“సూసేటి అగ్గి రవ్వ మాదిరి ఉన్నాడేనా స్వామి”.. ఈ పాట కోసం శ్రేయ ఘోషాల్ ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప 2 లోని “సూసేటి అగ్గిమాదిరి” అనే సాంగ్ బాగా వైరల్ గా మారింది . ఎంతలా అంటే చిన్నపిల్లలు అప్పుడే ఈ పాటపై రీల్ చేయడం కూడా ప్రారంభించేశారు. అంత బాగా ట్రెండ్ అయిపోతుంది కదా ఈ పాట ఇంత హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ శ్రేయ ఘోషల్ గొంతు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె ఏ పాట పాడిన అద్భుతంగా ఉంటుంది . ఆఫ్కోర్స్ ఇలాంటి మెలోడియస్ సాంగ్స్ పాడితే ఇంకా ఇంకా బాగుంటుంది .

తన గాత్రంతో ఈ పాటను అద్భుతంగా ఆలపించింది. చాలామంది జనాలకు ఈ పాట నచ్చేసింది . పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఈ పాటను లైక్ చేసి పాడుతున్నారు అంటే కారణం శ్రేయ ఘోషాల్ అనే చెప్పాలి . దానికి తగ్గ మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ అదరగొట్టేసాడు. శ్రీవల్లి పుష్పరాజ్ చించిపడేశారు . ఇక పాట సూపర్ హిట్ కాకుండా ఉంటుందా ..? ఈ పాట ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . ఈ పాట కోసం శ్రేయ ఘోషల్ కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిందట .

 

అందుతున్న సమాచారం ప్రకారం ..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఈ పాట కోసం శ్రేయ ఘోషల్ అక్షరాల 50 లక్షల ఛార్జ్ చేసిందట. ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు. అంతేకాదు ఈ పాటకు ఆమె న్యాయం చేసింది అంటున్నారు ఫాన్స్. మొత్తానికి ఈ సినిమా లో ఈ పాటే హైలేట్ గా మారిపోబోతుంది అన్నది మాత్రం వాస్తవం..!!