ఆ స్టార్ హీరో వల్లే నయన్ – విగ్నేష్ పెళ్లి చేసుకున్నారా.. ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ డైరెక్టర్..!!

సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ పాపులర్ జంటల్లో నయనతార, విగ్నేష్ శివ‌న్ జంట‌ కూడా ఒకటి. ఈ జంట సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరు ఒకరిపై ఒకరు పరస్పరం ప్రేమను చాటుకుంటూనే ఉంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విగ్నేష్ శివన్‌ నయన్‌ను కలవడానికి.. ఆమెకు అంత దగ్గరవ్వ‌డ‌నికి.. ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం స్టార్ హీరో అంటూ తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. ఇంతకీ నయన్‌, విగ్నేష్‌ల‌ పెళ్లికి కారణమైన ఆ స్టార్ హీరో ఎవరో ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విగ్నేష్ మాట్లాడుతూ 2015 నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు.

నేను దర్శకత్వం వహించే టైంలో.. నేను రౌడీనే సినిమాకు హీరోయిన్గా నయనతార అయితే బాగుంటుందని హీరో ద‌నుష్ వివరించాడ‌ని.. అయితే ధనుష్ చెప్పడంతోనే ఆమెకు కథ‌ వినిపించడానికి వెళ్ళానని.. వెంటనే ఆ సినిమాకు ఓకే చేయడం.. ఈ ప్రాజెక్టులో బాగం అవ్వ‌డం జరిగిందని.. మొదట ఈ సినిమాకు నో చెప్పిన విజయ్ సేతుపతి కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేను రౌడీనే సినిమా ప్రయాణం మొదలైందని.. మూవీ షూటింగ్ కు సంవత్సరం పట్టింది. ఏడాదంతా ఆమెతో కలిసి ఉండే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు. తన ఇష్టా, ఇష్టాలను, హావభావాలను తెలుసుకునే సమయం నాకు దొరికిందని.. ధనుష్ చెప్పకపోతే నేను ఆమెను తీసుకోవాలని ఐడియానే వచ్చేది కాదని.

అతని వల్లే నేను నయనతారను కలిశానంటూ వివరించాడు. అలా మా పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లిందని.. మా పరిచయానికి ధనుష్ పరోక్షంగా కారణం అంటూ వివరించాడు. దీనిపై నయ‌న్‌ మాట్లాడుతూ విగ్నేష్‌ తనకు మూడు నెలల్లోనే దగ్గరయ్యారని.. కొన్ని బంధాలు మనసుతో త్వరగా ముడి పడిపోతాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాతో ఏర్పడిన పరిచయాన్ని ఆరేళ్లపాటు ప్రేమాయంగా కంటిన్యూ చేసిన ఈ జంట 2021లో వీరు ప్రేమను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2022 జూన్ 9న వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక వీరికి ఉయిర్, ఉలగం అనే ట్విన్స్ ఉన్నారు.