చెత్త రీజన్ తో మహేశ్ నోరు తెరిచి అడిగినా.. సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సాధారణంగా మహేష్ బాబు ఎవరిని కూడా తన సినిమాలో నటించమని అడగడు ..బలవంతం చేయరు .. హీరోయిన్స్ విషయంలో మాత్రమే కేర్ఫుల్ గా ఉంటాడు ..మిగతా నటీనటుల విషయంలో చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు . డైరెక్టర్ – మేకర్స్ ఆ బాధ్యతలను తీసుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఎంతో ఇష్టపడితే తప్పిస్తే ఒక నటుడిని తన సినిమాలో నటించమంటూ అడగడు .

అయితే అలా అడిగిన ఒకే ఒక్క నటుడు కూడా మహేష్ బాబు ఆఫర్ ను రిజెక్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు స్పైడర్ అనే సినిమాలో నటించాడు . ఈ సినిమాలో విలన్ గా ఎస్ జే సూర్య నటించాడు . నిజానికి ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విలన్ షేడ్స్ పాత్రలో సముద్రఖని నటించాల్సి ఉన్నింది .

అయితే ఈ సినిమా కథ విన్నాక ఆయన ఎందుకో తేడా కొడుతుంది అంటూ రిజెక్ట్ చేశాడట . అయితే మహేష్ బాబునే స్వయాన ఈ పాత్రకు సముద్రఖని అయితే బాగుంటాడు అంటూ రిక్వెస్ట్ చేసి మరి ఆయనను అప్రోచ్ అయినా సరే సముద్రఖనీ ఈ ఆఫర్లు సున్నితంగా రిజెక్ట్ చేశాడట . అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ గా వైరల్ అయింది. అయితే రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ వేరేలా ఉంది . సినిమా టాక్ పక్కన పెడితే ఇప్పటికీ ఈ సినిమా టీవీలో చూసిన జనాలు హీరో మహేష్ బాబు కంటే విలన్ షేడ్స్ లో నటించిన సూర్య పాత్రను లైక్ చేస్తారు. అంత మంచి రోల్ మిస్ చేసుకున్నాడు సముద్రఖని..!!