75 ఏళ్ళ టాలీవుడ్ రికార్డ్‌ల‌ను బ్రేక్ చేసిన‌ మహేష్ మూవీ ఏంటో తెలుసా.. రీమేక్ అయిన ప్రతి చోట కూడా బ్లాక్ బ‌స్ట‌రే..?!

ఓ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిందంటే దాన్ని వెనక సినిమా టీం మొత్తం అహర్నిశలు శ్రమించడం, ఎంతో కష్టం దాగి ఉంటాయి. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా కూడా అలాంటిదే. 2006లో వ‌చ్చిన‌ ఈ సినిమాకు పూరి జగన్నాథ్ డైరెక్షన్ వహించారు. మహేష్, పూరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా అప్పట్లో రిలీజై కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు. కాగా ఈ సినిమా తెరకెక్కడం వెనుక ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు దాగి ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. అప్పటివరకు వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న పూరికి.. ఆంధ్రావాలా తో బ్రేక్ పడింది.

Mahesh Babu Pokiri Movie: 15 Years for Pokiri: Why the Mahesh Babu and Ileana Starrer Became an All-time Industry Hit

దీంతో బద్రి టైం లో ఆయన రాసుకున్న ఉత్తం సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ.. స్క్రిప్ట్ బయటకు తీసి మెరుగులు దిద్దాడు. ఈ కథ విన్న రవితేజ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారట. అయితే అదే టైంలో రవితేజకు నా ఆటోగ్రాఫ్ చేసే మంచి అవకాశం రావడంతో ఈ విషయాన్ని పూరీకి చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత ఏం చేయాలో తెలియని పూరి బాలీవుడ్ యాక్టర్ సోను సూద్‌తో ఉత్తమ్ సింగ్ సినిమా చేయాలని భావించాడట. కానీ అది జరగలేదు. అదే టైంలో తాజ్ హోటల్లో పూరి, మహేష్ ను కలిసాడట. అయితే గతంలో మహేష్ కు పూరి జగన్నాథ్ ఇడియట్ సినిమా స్టోరీ వినిపించగా అది ఆయనకు నచ్చలేదు.

Mahesh Babu Fans Celebrate 14 Years of Pokiri (Read Tweets) | 🎥 LatestLY

ఈసారి ఎలాగైనా ఒప్పించాలని ఉద్దేశంతో ఉత్తమ్ సింగ్ స్టోరీని మహేష్ కు వినిపించాడట పూరి జగన్నాథ్. అయితే ఈ స్టోరీ నచ్చడంతో నెక్స్ట్ ఇయర్ సినిమాను స్టార్ట్ చేద్దాం. కానీ సింగ్స్‌ బ్యాక్ డ్రాప్ మార్చేయమని.. ఉత్తమ సింగ్ టైటిల్ ని కూడా మార్చేయమని మహేష్ సజెస్ట్ చేశాడట. దీంతో మహేష్ వెంటనే పోకిరి గా సినిమా టైటిల్ ని మార్చేసాడు. ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. ఇక సినిమా హీరోయిన్ విషయంలో కూడా చాలా సెలక్షన్లు జరిగాయి. ఆయేషా టాకీయా, దీపిక పదుకొనే, పార్వతి మెల్టన్ ఇలా ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ మొదటి సినిమాకు హీరోయిన్స్ గా భావించారు. కానీ చివరకు ఇలియానా సినిమాకు హీరోయిన్గా ఫిక్స్ అయింది. సినిమా షూటింగ్ చాలా త్వరగా పూర్తయింది.

ప్రతి షార్ట్ సింగిల్ టేక్ లో పూరి ఓకే చేస్తాడు. ఇలా 70 రోజుల్లో షూటింగ్ పూర్తి అయిపోగా.. సరిగ్గా 2006 ఏప్రిల్ 28 సినిమా రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద సునామీ సృష్టించింది. తెలుగులో అప్పటివరకు ఉన్న అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. పోకిరి మహేష్ కి స్టార్డం తీసుకొస్తే.. పూరిని టాప్ డైరెక్టర్ చేసింది. ఇక 75 సంవత్సరాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా సాధించని రికార్డును పోకిరి సాధించింది. దీంతో ఇతర భాషల హీరోలు కూడా ఈ సినిమాపై మగ్గు చూపించారు. అలా 2007లో విజయ్ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్లో తమిళ్ లోను పోకిరి సినిమా వ‌చ్చి స‌క్స‌స్ సాధించింది. అలాగే బాలీవుడ్ లో 2009లో సల్మాన్ ఖాన్ హీరోగా మ‌ళ్ళీ ప్ర‌భుదేవా వాంటెడ్ పేరుతో ఈ సినిమా రీమేక్ చేశాడు. అక్కడ కూడా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఇలా మహేష్ నటించిన పోకిరి సినిమా రీమేక్ అయిన ప్రతి చోట బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని రికార్డ్ సృష్టించింది.