సీక్రెట్ ఎంగేజ్మెంట్ పై హీరో సిద్ధార్థ్ క్లారిటీ.. జరిగింది ఇదే అంటూ..

టాలీవుడ్ హీరోయిన్ అదితిరావ్‌ హైదారితో గత నెలలో సిద్ధార్థ్ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే మొదటిసారి సిద్ధార్థ్‌ ఈ వార్తలపై స్పందించాడు. మార్చి 27న ఈ జంట వనపర్తి జిల్లాలో శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సీక్రెట్ గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు.

అయితే తాజాగా తన నిశ్చితార్థ వేడుకపై.. ఓ అవార్డు వేడుకల్లో పాల్గొన్న సిద్ధార్థ మాట్లాడాడు. అందరూ అనుకున్నట్లుగా అది సీక్రెట్ ఎంగేజ్మెంట్ కాదని.. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు చాలా తేడా ఉంటుందని వివరించాడు. మాది ప్రైవేట్ ఎంగేజ్మెంట్.. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించాం. దీంతో ఆహ్వానం లేని వాళ్ళు సీక్రెట్ ఫంక్షన్ గా భావించారు. అయితే మా నిశ్చితార్థంలో ఎలాంటి సీక్రెట్ లేదు. ఏం చేసినా పెద్దల నిర్ణయం ప్రకారమే మేము జరుపుకున్నాం అని సిద్ధార్థ వివరించాడు.

మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్‌, అదితిరావ్‌ హైదారి మొదటిసారి కలిసి పని చేశారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్యన ప్రేమ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత కూడా వీరిద్దరూ జంటగా ఎన్నోసార్లు కెమెరా కంటపడ్డారు. దీనితో వీరు ఇద్దరు ప్రేమాయణం నడుపుతున్నారంటూ పలుసార్లు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలా కొన్ని నెలల ప్రేమాయ‌ణం తర్వాత వీరిద్దరూ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే సిద్ధార్థ్, అదితీరావ్ హైదారి ఇద్దరికీ ఇది రెండవ పెళ్ళే కావడం విశేషం.